ప్రభాస్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమాకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన చేసింది సినిమా యూనిట్. వాస్తవానికి అనేక సార్లు వాయిదా పడిన తర్వాత జనవరి 14 వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తామని అధికారికంగా గతంలో ప్రకటించారు. కానీ కరోనా మూడవ దశలో భారీగా కేసులు నమోదవుతున్న కారణంగా మిగతా పెద్ద సినిమాల లాగానే ఈ సినిమా కూడా వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ప్రకటించింది ఈ సినిమా యూనిట్. ఈ సినిమాను మార్చి 11వ తేదీన థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని చెబుతూ ఒక పోస్టర్ విడుదల చేసింది.
Read Also : ప్రభాస్ వర్సెస్ సూర్య… ‘రాధేశ్యామ్’కు గట్టి పోటీనే!
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ ఒక జ్యోతిష్య నిపుణుడి పాత్రలో నటిస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సినిమా నుంచి విడుదలైన పాటలు అలాగే ఇతర ప్రమోషనల్ స్టఫ్ అంతా సినిమా మీద ఆసక్తి పెంచే విధంగా మారడంతో సినిమా కోసం కేవలం ప్రభాస్ అభిమానులే కాక సినీ ప్రేమికులు అందరూ విపరీతంగా వెయిట్ చేస్తున్నారు.