OTT Trending Movie: టాప్ ట్రెండింగ్ లో100 కోట్ల సినిమా.. ఓటీటీలో ఇరగదీస్తున్న యాక్షన్ కామెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTT Trending Movie: థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తోంది. అదే సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లతో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ మూవీ, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా ఈ మూవీ నిలిచింది కూడా. ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు ఓటీటీలో అత్యధిక వ్యూస్ జాబితాలో టాప్‌లో కొనసాగుతోంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను ఆస్వాదిస్తున్నారు.
జియో హాట్‌స్టార్‌లో
జూన్ 19న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా సంచలన విజయం నమోదుచేసింది. ఆతరువాత జులై 17 నుంచి జియో హాట్‌స్టార్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది సమయంలోనే ట్రెండింగ్‌లో అగ్రస్థానానికి చేరుకుని మరోసారి తన సత్తా చాటింది ఈ మూవీ. సుమారు రెండు గంటల 32 నిమిషాల నిడివి గల ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్లో సమంత ఒక్కరే కథను తన భుజాలపై మోశారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం థియేటర్లలో మంచి స్పందన దక్కించుకోగా, ఇప్పుడు డిజిటల్ వేదికలోనూ అదే ఊపును కొనసాగిస్తోంది.
Also Read
- Uyir OTT Release: రియల్ పోలీస్ రాసిన కథ.. ఓటీటీలోకి వస్తున్న మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'ఉయిర్'!
- Love O Love OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీలోకి 'లవ్ ఓ లవ్'.. ధనుష్ మేనల్లుడు సినిమా ఎక్కడ చూడాలంటే?
- Zee5 Upcoming Movies: జీ5 మెగా లైనప్ అనౌన్స్.. వెంకటేష్, బాలయ్య, నాగచైతన్య సినిమాలతో భారీ ప్లాన్!
- Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్!
సినిమా కథ
ఈ కథ స్వర్ణ అనే అనాథ యువతి చుట్టూ తిరుగుతుంది. బయటకు ఎంతో అమాయకంగా కనిపించే ఆమె జీవితంలో మాత్రం ఎన్నో విషాదాలు దాగి ఉంటాయి. పెళ్లి తర్వాత డాక్టర్ అయిన తన భర్త కుటుంబంలో కలిసిపోవాలని ఎంత ప్రయత్నించినా పరిస్థితులు ఆమెకు అనుకూలంగా మారవు. ఇదే సమయంలో గతంలో తనకు శత్రువులుగా ఉన్న వ్యక్తులు మళ్లీ ఆమె జీవితంలోకి అడుగుపెడతారు. దీంతో తనను మాత్రమే కాదు, తన భర్త కుటుంబాన్ని కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత స్వర్ణ పూర్తిగా మారిపోతుంది. పరిస్థితులు ఆమె చేతిలో ఆయుధం పట్టేలా చేస్తాయి. తనను వెంబడించే శత్రువులను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రతీకారం తీర్చుకునే మహిళగా ఆమె ప్రయాణం సాగుతుంది. ఆమె అసలు స్వరూపాన్ని చూసి కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోతారు. ఈ పాత్రలో సమంత చూపించిన యాక్షన్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు.
అయితే ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు సహా కొన్ని భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. హిందీ వెర్షన్ మాత్రం ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కాలేదు. అయినప్పటికీ సమంత అభిమానులతో పాటు యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి ఆదరణ చూపిస్తున్నారు. థియేటర్ల తర్వాత డిజిటల్ వేదికలోనూ ఇదే స్థాయి స్పందన రావడంతో, ‘మా ఇంటి బంగారం’ మరోసారి విజేతగా నిలిచిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- Tags
- cinema
- JioHotstar
తాజావార్తలు
-
OTT Trending Movie: టాప్ ట్రెండింగ్ లో100 కోట్ల సినిమా.. ఓటీటీలో ఇరగదీస్తున్న యాక్షన్ కామెడీ..
-
Ishan Kishan: నేను అస్సలు టెన్షన్ పడలేదు.. ఎక్కడ తగ్గాలో నాకు తెలుసు!
-
Kargil Vijay Diwas 2026: కార్గిల్ విజయ్ దివస్.. వీర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోడీ..
-
NBK111: బాలయ్య కోసం గోపీచంద్ ప్రత్యేక హోమం.. డిశ్చార్జ్‌పై గుడ్ న్యూస్!
-
Arunachalam Cave Tragedy: అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో చిక్కుకుని రాజమహేంద్రవరం భక్తుడు మృతి!
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!