Pyaar Prema Kalyanam OTT: పెళ్ళాం ఇంటికి మకాం మార్చే మొగుడు… ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pyaar Prema Kalyanam OTT : థియేటర్ల కంటే ఇప్పుడు నేరుగా ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. వీటిలో ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ రొమాంటిక్ కామెడీలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. నటుడు ఎలాన్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీని మేకర్స్ ఆఫీషియల్ గా ప్రకటించారు. దీంతో ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చూసేందుకు ఓటీటీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
‘ప్యార్ ప్రేమ కళ్యాణం’ మూవీ 2026 ఆగస్టు 21 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. థియేటర్ విడుదల లేకుండానే నేరుగా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు ఈ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రానుంది. ఈ తమిళ మూవీ తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో కూడా అందుబాటులోకి వస్తోంది.
Also Read
- Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో 'సునీల్'.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
- OTT Releases: ఓటీటీలో హాలీవుడ్ హవా.. ఈ వీకెండ్ వీటిని అస్సలు మిస్ చేయొద్దు
- Shaque: నమ్మక ద్రోహాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Thudakkam OTT Release: విస్మయ మోహన్‌లాల్ తొలి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ఈ సినిమా కథ
ఈ కథ పావి అనే ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చుట్టూ తిరుగుతుంది. పెళ్లి తర్వాత కూడా తన కుటుంబాన్ని విడిచి వెళ్లాలని ఆమె కోరుకోదు. దీంతో ఆమె భర్త ఆమె ఇంటికే వచ్చి నివసించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడి నుంచి రెండు కుటుంబాల మధ్య రోజువారీ జీవితంలో వచ్చే సరదా సంఘటనలు, చిన్న చిన్న అపార్థాలు, ఎమోషన్స్ కథను ముందుకు నడిపిస్తాయి. సంప్రదాయ కుటుంబ విలువలు, ఈ తరం దాంపత్య జీవితం మధ్య సాగే ఈ స్టోరీని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
తారాగణం
ఈ మూవీలో ఎలాన్ సరసన సాన్వే మేఘన కథానాయికగా నటించారు. ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్, హాస్యనటుడు యోగి బాబు, ఎంఎస్ భాస్కర్, గీతా కైలాసం, ఎలాంగో కుమారవేల్, సెంథిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంగీతాన్ని యువన్ శంకర్ రాజా అందించగా, ఆయన స్వరాలు సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రానికి దర్శకుడిగా ఎలాన్ వ్యవహరించారు. ఆసక్తికరంగా, ఈ సినిమా పేరు ఆయన 2018లో తెరకెక్కించిన తొలి మూవీ ‘ప్యార్ ప్రేమ కాదల్’ను గుర్తు చేస్తుంది. అయితే కథ పరంగా ఇది పూర్తిగా కొత్త చిత్రం అని తెలుస్తోంది. రొమాన్స్, కుటుంబ బంధాలు, వినోదం కలగలిసిన కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’ మంచి వినోదాన్ని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?