Operation Valentine Teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమాపై వరుణ్ తేజ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. గత కొన్నాళ్లుగా వరుణ్ తేజ్ మంచి విజయాన్ని అందుకున్నది లేదు. అందుకే ఈ సినిమా కోసం వరుణ్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి నుంచి కూడా వరుణ్ తేజ్ ప్రయోగాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఈసారి ఈ సినిమాతో మరోసారి ప్రయోగం చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో వరుణ్.. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించాడు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ” మన ఎయిర్ ఫోర్స్ ను ఇంకొక దేశం పంపించడమంటే.. అది యుద్దానికి సంకేతమే” అని ఒక ఆఫీసర్ చెప్పిన డైలాగ్ తో టీజర్ ప్రారంభమయ్యింది.
ఇక మన దేశం మీదకు శత్రువులు దండెత్తడానికి వస్తున్నట్లు తెలుసుకున్న హీరో.. తిరిగి యుద్దానికి పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. శత్రువులకు ఒక విషయం గుర్తుచేయాల్సిన సమయం వచ్చేసింది. మన దేశం గాంధీజీ తో పాటు సుభాష్ చంద్రబోస్ ది కూడా అని వరుణ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఆపరేషన్ వాలెంటైన్ గా వేరే దేశానికి యుద్దానికి వెళ్లిన హీరో.. ఏం చేశాడు.. ఎలా ఈ ఆపరేషన్ ను సక్సెస్ చేసాడు అనేది కథగా తెలుస్తోంది. ఇక మానుషీ చిల్లర్.. వరుణ్ కో ఆఫీసర్ గా కనిపించింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. మొత్తానికి టీజర్ తో ఒక హైప్ ను క్రియేట్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో వరుణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.