Site icon NTV Telugu

NBK 107 : మరో పవర్ ఫుల్ టైటిల్… సింహా సెంటిమెంట్ ?

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ మూవీ “NBK 107” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభించగా, మూవీ సెట్స్ లో నుంచి బాలయ్య లుక్ లీక్ అయింది. బాలయ్య పవర్ ఫుల్ లుక్ సోషల్ మీడియా సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. నిజజీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో సాగే మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని సమాచారం. అయితే సినిమాకు “జై బాలయ్య” అనే టైటిల్ ఖరారు చేశారని ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. టైటిల్ ను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. కానీ తాజాగా మరో పవర్ ఫుల్ టైటిల్ సినిమాకు అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

Read Also : BheemlaNayak : తమన్ కు పవర్ ఫుల్ హగ్… పిక్ వైరల్

“NBK 107″లో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనుండగా, అందులో ఒక పాత్రలో ‘వీరసింహా రెడ్డి’గా కనిపించనున్నాడు. ఈ సినిమా టైటిల్‌ కు “వీరసింహా రెడ్డి” అనే టైటిల్‌ని మేకర్స్ పరిశీలిస్తున్నారు. టైటిల్ ను చూసిన నెటిజన్లు ‘సింహా’ సెంటిమెంట్ ను మేకర్స్ ఫాలో అవుతున్నారని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఓ కన్నడ మూవీకి రీమేక్ అని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఇటీవల లీకైన పిక్ తో ఆ రూమర్స్ మరింతగా బలపడ్డాయి. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి నిర్మాతలు కాగా, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ యూఎస్ఏలో జరుగుతుంది.

Exit mobile version