One More Child Heart Operation done by Mahesh Babu Foundation: మహేష్ బాబు హీరోగా అనేక సినిమాలు చేస్తూనే మరోపక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు కొన్ని ఆరోగ్య పరిస్థితుల కారణంగా గుండె జబ్బులు ఉన్న చిన్నారులకు వైద్యం చేయించాలని మహేష్ బాబు అనుకున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు గుండె జబ్బుతో బాధపడుతున్న ఎంతోమంది చిన్నారుల పాలిట ప్రాణదాత అయ్యాడు. ఇక తాజాగా మరోసారి చిన్నారి ప్రాణలు నిలిపి మహేష్ బాబు మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన నాలుగు నెలల శాన్విక గుండెకు రంధ్రం ఉండటంతో ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. పాపకు సర్జరీ చేయించడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని తల్లిదండ్రులు బాధపడుతున్న సమయంలో మహేష్ బాబు ఫౌండేషన్ గురించి డాక్టర్ల ద్వారా తెలుసుకుని వెంటనే వారిని సంప్రదించగా పాప గుండె ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే పాపకు గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
Nandamuri Mokshagna: ఓ.. బాలయ్య.. కొడుకు టాలీవుడ్ ఎంట్రీ ఉందా.. ఎన్నాళ్లు దాస్తావయ్యా.. ?
దీంతో ఈ పాపకి ప్రాణాపాయం తప్పింది, ఈ నేపథ్యంలో చిన్నారి తండ్రి సంజీవ రాయుడు మాట్లాడుతూ.. ‘మా పాప శాన్విక రాయుడు, రెండు నెలలు ఉన్నప్పుడు ఆనారోగ్యానికి గురైంది. హాస్పిటల్ కి తీసుకువెళ్లగా డాక్టర్లు పరీక్షించి పాపకు గుండెలో హోల్ ఉందని చెప్పారు, అక్కడ నుంచి ఆంధ్ర హాస్పిటల్ కి రిఫర్ చేశారని అన్నారు. అప్పటి నుంచి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాం, పాపకు సర్జరీ చేయాలని ఖచ్చితంగా చెప్పారు కానీ అంత డబ్బు మా వద్ద లేకపోవడంతో ఆందోళన చెందామని అన్నారు ఆ సమయంలోనే మహేష్ బాబు ఫౌండేషన్ ని సంప్రదించామని, వారు వెంటనే రెస్పాండ్ అయి పాపకు ఆపరేషన్ చేయించారని అన్నారు. మా పాప ప్రాణాలు నిలిపిన మహేష్ బాబు గారికి ధన్యవాదాలు’ అని అన్నారు. ఇప్పటికే మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా రెండు వేల మందికి పైగా చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేన్లు చేయించి ప్రాణాలను నిలబెట్టగా ఆయన ప్రాణదానం చేసిన లిస్టులో ఇప్పుడు మరో చిన్నారి చేరింది.