OG 2 Update: ‘ఓజీ 2’ కోసం సుజీత్ మాస్టర్ ప్లాన్.. ఒకటికి రెండుసార్లు.. పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్?
- బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించిన ఓజీ 2
- పండగ చేసుకున్న మెగా అభిమానులు
- ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్న సుజీత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sujeeth Reworking Script fo Pawan Kalyan OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో వచ్చిన ‘ఓజీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా చూపించిన తీరు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, మార్షల్ ఆర్ట్స్ సన్నివేశాలు మెగా అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగించాయి. ఎస్ఎస్ థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న ‘ఓజీ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి భాగం సాధించిన విజయాన్ని మించేలా రెండో భాగాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు సుజీత్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మొదటి భాగంలో పవన్ కళ్యాణ్ స్టైల్, హీరోయిజం, యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చినప్పటికీ.. కథ అండ్ స్క్రీన్‌ప్లే విషయంలో మరింత బలంగా ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఎమోషన్స్ పరంగా సినిమా ఇంకాస్త ప్రభావం చూపాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ‘ఓజీ 2’లో అలాంటి లోపాలు కనిపించకుండా.. డైరెక్టర్ సుజీత్ కథపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ అభివృద్ధి పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తూ.. ప్రతి సన్నివేశాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ముఖ్యంగా బలమైన భావోద్వేగాలు, పవర్ఫుల్ విలన్ పాత్ర, మరింత ఆసక్తికరమైన కథనం, ట్విస్టులతో కూడిన స్క్రీన్‌ప్లేను సుజీత్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా స్టైలిష్ యాక్షన్‌తో పాటు ప్రేక్షకులను భావోద్వేగంగా కట్టిపడేసే కథను అందించాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. పవన్ వంటి మాస్ హీరోకు స్టైలిష్ యాక్షన్‌కు తోడు బలమైన కథ కూడా జతైతే.. ఓజీ 2 బాక్సాఫీస్ వద్ద తొలి భాగాన్ని మించిన విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నట్లు సమాచారం. అన్ని ఏర్పాట్లు పూర్తయిన అనంతరం త్వరలోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్‌ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!