సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని నటీనటులు, దర్శకులు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తున్నారు. ధనుష్, విజయ్ సేతుపతి వంటి నటుల తర్వాత శంకర్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు టాలీవుడ్‌లో తమదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు శివకార్తికేయన్ తెలుగులో అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు. తమిళ పరిశ్రమలో ప్రతిభావంతులైన నటులలో ఒకరైన శివకార్తికేయన్ తన టాలీవుడ్ అరంగేట్రం కోసం దర్శకుడు అనుదీప్ కెవితో కలిసి పని చేయనున్నారు. ‘జాతిరత్నాలు’ అనే సూపర్ సక్సెస్‌ఫుల్ డెబ్యూ మూవీ తర్వాత అనుదీప్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్. వాస్తవానికి ఈ వార్త ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అఫిషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇప్పుడే వచ్చింది చిత్రబృందం నుంచి.
Read Also : ‘పుష్ప’రాజ్ ట్రాన్స్ లో హనుమ విహారి… ఇట్స్ మూవీ టైమ్ !
శివకార్తికేయన్ ఏ పాత్రనైలోనైనా సులభంగా ఒదిగిపోతాడు. దర్శకుడు అనుదీప్ నటుల నుంచి అత్యుత్తమ హాస్యం, నటనను బయటకు తీసుకురాగలడు. ఈ చిత్రం తెలుగు, తమిళం రెండు భాషల్లో రూపొందుతున్నట్లు సమాచారం. ఈ కొత్త చిత్రానికి సౌత్ ప్రముఖ స్వరకర్తలలో ఒకరైన థమన్ సంగీతం అందించనున్నారు. తాత్కాలికంగా #SK20 అని పిలవబడే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్, శాంతి టాకీస్, సురేష్ ప్రొడక్షన్స్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, అరుణ్ విశ్వ, సురేష్ దగ్గుబాటి సంయుక్తంగా నిర్మించనున్నారు. అయితే ఇందులో హీరోయిన్ ఎవరన్న విషయాన్నీ మాత్రం సస్పెన్స్ లో ఉంచడం గమనార్హం.