Odela-2 : మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల-2. అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 17న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అమాంతం అంచనాలను పెంచేసింది. ఓదెల ఊరిని పట్టి పీడించే దుష్టశక్తులను.. తమన్నా ఎలా ఎదుర్కుంది అనే కోణంలో దీన్ని తీశారు. హై సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో దీన్ని తీస్తున్నారు. ఇందులో తమన్నా నాగసాధవుగా నటిస్తోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ముంబైలో నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనౌన్స్ చేశారు. రేపు సోమవారం పార్క్ హయత్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నామని మూవీ టీమ్ ప్రకటించింది.
Read Also : Samantha : కోట్లు ఇస్తామన్నా ఆ పని చేయనని చెప్పా : సమంత
ఇందులో తమన్నా మెయిన్ లీడ్ రోల్ చేస్తుండగా.. హెబ్బా పటేల్, మురళీశర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఓదెల గ్రామంలో జరిగే థ్రిల్లర్ సస్పెన్స్ సీన్లతో తీసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తమన్నా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ మూవీపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తోంది. సంపత్ నంది ఆధ్వర్యంలో దీన్ని తీశారు. డి.మధు, సంపత్ నంది కలిసి దీన్ని నిర్మించారు. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో రెండో పార్టుపై అంచనాలు బాగానే పెరిగాయి. అయితే ఈ సినిమాకు పోటీగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి కూడా రిలీజ్ కాబోతోంది. ఈ రెండు సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.