Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతోంది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘నేను గతంలో చాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉన్నాను. ఎన్నో బిజినెస్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేశాను. నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎన్ని బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉంటే అంత పెద్ద స్టార్ అనే వారు. కాబట్టి అప్పుడు ఎక్కువగా ప్రమోట్ చేశాను. దానికి నేను ఇప్పటికీ బాధపడుతుంటాను. కానీ ఇప్పుడు ఆ పని మానేశాను. ఏది పడితే అది ప్రమోట్ చేయట్లేదు. బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి కూడా ఒప్పుకోవట్లేదు’ అంటూ తెలిపింది.
Read Also : Tamil Nadu Governor: ‘‘జై శ్రీరాం’’ నినాదం వివాదంలో గవర్నర్ ఆర్ఎన్ రవి..
‘ఈ ఏడాదిలో నా వద్దకు 15 రకాల బ్రాండ్స్ వచ్చాయి. వాటికి అంబాసిడర్ గా చేయాలన్నారు. కోట్లలో డబ్బులు ఇస్తామని ఆఫర్ చేశారు. కానీ నేను చేయలేనని చెప్పాను. ఇప్పటికీ నా వద్దకు చాలా బ్రాండ్స్ వస్తున్నాయి. వాటిని ముందుగా నాకు తెలిసిన ముగ్గురు డాక్టర్ల వద్దకు పంపిస్తాను. అవి ప్రజలకు ఎలాంటి హాని చేయవు అని తెలిస్తేనే ప్రమోట్ చేయడానికి ఒప్పుకుంటున్నాను. లేదంటే వాళ్లు ఎంత ఇస్తామన్నా సరే వద్దని చెప్తున్నాను. ప్రజలకు హాని చేసే ఎలాంటి వస్తువులను ప్రమోట్ చేయొద్దని నిర్ణయం తీసుకున్నాను. నన్ను ఫాలో అయ్యేవారు నా వల్ల ఇబ్బందులు పడొద్దు’ అంటూ చెప్పుకొచ్చింది సమంత.