Obsession : ఇండియాలో అబ్సెషన్ కలెక్షన్ల సునామీ… కన్జ్యూరింగ్ రికార్డ్స్ బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Obsession : హాలీవుడ్లో భారీ బడ్జెట్లు, స్టార్ హీరోలు, విపరీతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉంటేనే సినిమా విజయవంతమవుతుందనే అభిప్రాయాన్ని మరోసారి తలకిందులు చేసింది ‘అబ్సెషన్’. కేవలం 7 కోట్ల రూపాయల అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ హారర్ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేస్తూ బాక్సాఫీస్ చరిత్రలో అరుదైన రికార్డును రాస్తోంది. చిన్న చిత్రంగా ప్రారంభమైన ఈ మూవీ, ప్రస్తుతం వేల కోట్ల వసూళ్లతో సినీ పరిశ్రమను పూర్తిగా తనవైపు తిప్పుకుంది. హారర్ జానర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి మార్కెట్ ఉందో మరోసారి ఈ సినిమా నిరూపిస్తోందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
విడుదలైన తొలి రోజుల్లోనే మంచి టాక్‌ను సొంతం చేసుకున్న ‘అబ్సెషన్’ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన మౌత్ పబ్లిసిటీని అందుకుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా సినిమాపై ప్రశంసలు కురిపించడంతో, రోజురోజుకూ ఈ సినిమాను చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగింది. ట్రేడ్ నివేదికల ప్రకారం ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్ల వసూళ్ల మార్క్ ను చేరుకుంది. ఇండియన్ మార్కెట్లో కూడా ‘అబ్సెషన్’ మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు రూ.70 కోట్లకు పైగా వసూళ్లు ఈ సినిమా సాధించింది. హారర్ చిత్రాలకు భారత ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆదరణకు ఈ సినిమా మరో ఉదాహరణగా నిలిచింది.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
ఈ విజయంతో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ హారర్ చిత్రాల జాబితాలో ‘అబ్సెషన్’ రెండో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో ‘ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్’ రికార్డును అధిగమించింది. ప్రస్తుతం ఈ జాబితాలో సుమారు రూ.82 కోట్ల వసూళ్లతో ‘ది కంజూరింగ్ ది లాస్ట్ రైట్స్’ తొలి స్థానంలో కొనసాగుతోంది. అయితే ‘అబ్సెషన్’కు ఇంకా మంచి థియేట్రికల్ రన్ ఉండటంతో ఆ రికార్డును కూడా అధిగమించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి వేల కోట్ల వసూళ్లను అందుకోవడం అంటే ప్రపంచ సినీ పరిశ్రమలోనే అరుదైన ఘటనగా చెప్పాలి. భారీ స్టార్ కాస్ట్ లేకపోయినా, కంటెంట్ ఉంటే సినిమా ఎంతటి విజయాన్ని సాధించగలదో ‘అబ్సెషన్’ స్పష్టంగా చూపించింది. ఇదే ఊపు కొనసాగితే భారతదేశంలో రూ.100 కోట్ల మార్కును కూడా ఈ చిత్రం అందుకోవడం ఆశ్చర్యకరమైన విషయం కాదని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!