O Saathiya: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన చిన్నదానా నీకోసం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ మిస్తీ చక్రవర్తి. ఈ సినిమా అమ్మడికి హిట్ ను అయితే అందించలేకపోయింది కానీ, టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం దగ్గర అయ్యేలా చేసింది. చాలా గ్యాప్ తరువాత మిస్తీ నటిస్తున్న చిత్రం ఓ సాథియా. ఆర్యన్ గౌర ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ చిత్రానికి దివ్య భావన దర్శకత్వం వహిస్తుంది. తన్వికా జాశ్విక క్రియేషన్స్ బ్యానర్ పై చందనా కట్ట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
ఇక దీంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన మేకర్స్ తాజగా ఈ సినిమా ఫిరత్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ ఎంతో అందంగా కనిపిస్తోంది. పచ్చని గడ్డిపై ఆర్యన్ కింద కూర్చోని ఉండగా మిస్తీ చేతిలో మందు బాటిల్ పట్టుకొని నవ్వులు చిందిస్తోంది. పోస్టర్ ను బట్టి ఇదొక అందమైన ప్రేమ కథలా కనిపిస్తోంది. విన్ను ఈ సినిమాకు సంగేతేహం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో చిత్ర బృందం ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.