NTV Film Roundup: Telugu Movie Shooting Updates 9th December 2023: ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా టాలీవుడ్ లో జరుగుతున్న షూటింగ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం చదివేయండి. ప్రస్తుతానికి బడా సినిమాలన్నీ దాదాపు సెట్స్ మీదనే ఉన్న సంగతి తెలిసిందే.
1. #NBK109 – Nandamuri Balakrishna Shooting Update: ముందుగా బాలకృష్ణ సినిమా విషయానికి వస్తే బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని ఉదగమండలం అదేనండీ ఊటీలో జరుగుతోంది. ఈ క్రమంలో బాలయ్యను కలిసేందుకు తమిళనాడు అభిమానులు, ఊటీకి ట్రిప్ వెళ్లిన తెలుగు వారు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
2. #TheGirlfriend – Rashmika Shooting Update: ఇక రష్మిక కీలక పాత్రలో నటిస్తున్న గర్ల్ ఫ్రెండ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై సంయుక్తంగా విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
3. #FamilyStar – Vijay Deverakonda Shooting Update:
ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ మొన్నటి వరకు ఢిల్లీలో జరుగగా ఇప్పుడు షూటింగ్ అమెరికాలో బయలుదేరింది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ న్యూ జెర్సీలో జరుపుకుంటోంది.
4. #LuckyBaskhar Shooting Update: ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్ అనే పాన్ ఇండియా సినిమా ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.