NTR: భయమంటే తెలియని ఎన్టీఆర్ నే భయపెట్టిన మొనగాడు.. ఇతడే.. గుర్తుపట్టారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR: నందమూరి తారకరామారావు పోలికలతో పాటు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొంది.. విమర్శలను ఎదుర్కొని.. ఇప్పుడు దేశానికే గర్వకారణం అని అనిపించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 చేస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇకపోతే నిన్నటితో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి ఏడాది పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు.
“ఆర్ఆర్ఆర్ సినిమాను కుటుంబంతో సహా నేను ఒక ప్రైవేట్ థియేటర్ లో చూశాను. మా అమ్మ నాతో కాకుండా ఎక్కడో దూరంగా కూర్చుంది. నా ఇంట్రడక్షన్ సీన్ చూసి.. ఏడుపు ఆపుకోలేక నా దగ్గరకు వచ్చి ఏడ్చేసి.. ఎంత బాగా చేశావ్ అంటూ మెచ్చుకొని నా పక్కన కూర్చొని సినిమా చూసింది. అది నా జీవితంలో మర్చిపోలేని మూమెంట్” అని చెప్పుకొచ్చాడు. ఇక భార్య ప్రణతి గురించి మాట్లాడుతూ.. ” నేను పెళ్ళికి ముందు ఒకలా ఉండేవాడిని.. నన్ను ప్రణతి పూర్తిగా మార్చేసింది. అప్పట్లో కోపం మాములుగా ఉండేది కాదు. ఇప్పుడు అసలు ఆ కోపం ఎక్కడికి వెళ్లిందో కూడా తెలియడం లేదు. నా భార్యను గౌరవిస్తా. నన్ను చాలా మార్చేసింది. మా ఇంటి హోమ్ మినిస్టర్ మాట తప్పక వింటా పాటిస్తా” అని చెప్పుకొచ్చాడు.
Also Read
ఇక తన పెద్ద కొడుకు అభయ్ రామ్ కు తాను భయపడతానని, అతడు కనిపిస్తే పారిపోతాను అని చెప్పుకురావడం సెన్సేషన్ గా మారింది. ” నా పెద్ద కొడుకు అభయ్.. వాడు కొడుకు కాదు క్వశ్చన్ బ్యాంక్. ఎప్పుడు ఏదో ఒక ప్రశ్నను బుర్రలో పెట్టుకొని తీరుగుతూ ఉంటాడు. వాడు అడిగిన ప్రశ్నలకు నేను చాలా ఓపికగా సమాధానాలు చెప్తూ ఉంటా.. ఒక్కోసారి వాడు అడిగే ప్రశ్నలు ఏంటో అస్సలు అర్ధం కాదు. ఆ సమయంలో వాడి నుంచి తప్పించుకొని పారిపోతాను. అందుకే నాకు వాడు అంటే నాకు భయం. పాపం ప్రణతి.. వాడి ప్రశ్నలకు బలైపోతుంది అని చెప్పుకొచ్చాడు. ఇక తనకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టమని, రెండో సారి అమ్మాయి పుడుతుంది అని ఎంతో ఆశపడ్డాను అని తెలిపాడు. అందుకే తనకు ఆడపిల్లలు ఉన్న వాళ్ళను చూస్తే అసూయగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఎన్టీఆర్ మాటలు విన్న అభిమానులు భయమంటే తెలియని ఎన్టీఆర్ నే భయపెట్టిన మొనగాడు అభయ్.. సూపర్ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!