యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. రెండు రోజుల క్రిత్రం ఎన్టీఆర్ ఫ్యామిలీతో పారిస్ కి వెళ్ళాడు. అక్కడ ఎప్పటికప్పుడు తన వారసులతో ఎంజాయ్ చేస్తున్న క్షణాలను ఫోటోలలో బంధించి అభిమానులతో పంచుకుంటున్నాడు ఎన్టీఆర్. నిన్నటికి నిన్న పెద్ద కొడుకు అభయ్ రామ్ ని ఈఫిల్ టవర్ వద్ద ముద్దాడుతూ కనిపించిన తారక్ తాజాగా చిన్న కొడుకు భార్గవ్ రామ్ తో కలిసి దిగిన క్యూట్ పిక్స్ ని షేర్ చేశాడు.
ట్రైన్ లో భార్గవ్ రామ్ ని ముద్దాడుతూ కనిపించాడు .. మరో ఫొటోలో ఎన్టీఆర్ భార్య ప్రణతి ఒడిలో ఎంతో ఒద్దికగా కూర్చున్న భార్గవ్ ఇంకా ముద్దొచ్చేస్తున్నాడు.. ఈ అందమైన ఫోటోలకు ఇంకా అందంగా క్యాప్షన్ ఇచ్చాడు తారక్.” నాకు ఎన్నో చెప్పాలని ఉంది.. కానీ ప్రస్తుతానికి ఈ జర్నీని ఎంజాయ్ చేస్తున్నా” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.
https://www.instagram.com/p/CWlNkoNPDoZ/