RRR: కొమురం భీమ్ పాత్ర పట్ల అసంతృప్తి .. ఎట్టకేలకు నోరు విప్పిన ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ మార్చి 25 న రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు రాబడుతున్న సంగతి తెల్సిందే. ఇక అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారనే చెప్పాలి. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యిన దగ్గరనుంచి తారక్ అభిమానులు కొందరు మాత్రం కొమురం భీమ్ పాత్ర పట్ల అసంతృప్తి చెందినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్న సంగతి తెలిసిందే. సినిమాలో చరణ్ పాత్ర ఎక్కువ హైలెట్ అయ్యిందని, తారక్ కు తక్కువ స్పేస్ ఇచ్చాడని రాజమౌళిని ఏకిపారేస్తున్నారు. అంతేకాకుండా క్లైమాక్స్ ఫైట్ లో చరణ్ హైలెట్ అయ్యేలా డిజైన్ చేశారని ఫ్యాన్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. అయితే సినిమాలో ఏ హీరోను తక్కువచేసి చూపలేదని, ఇద్దరికీ సమానమైన స్క్రీన్ స్పేస్ ఇచ్చినట్లు రాజమౌళి చాలాసార్లు చెప్పుకొచ్చాడు.
ఇక తాజాగా ఈ వార్తలపై తారక్ స్పందించాడు. ” ఈ సినిమాలో ఇద్దరికీ సమానమైన స్క్రీన్ స్పేస్ ని జక్కన్న ఇచ్చాడు. ఒక సీన్ లో చరణ్ ని ఎలివేట్ చేసే సీన్స్ ఉంటే, మరొక సీన్ లో నన్ను ఎలివేట్ చేసే సీన్స్ ఉంటాయి. ఇద్దరికీ సమానంగా నటించే అవకాశం ఇచ్చినందుకు రాజమౌళికి థాంక్స్ చెప్తున్నాను. నా పాత్రకు సంబంధించి ఎటువంటి అసహనం కానీ, అసంతృప్తి కానీ లేదు. ఇద్దరిలో ఏ ఒక్కరిని తక్కువ చేయలేము.. అసలు ఆ ఇద్దరు లేకపోతే ఆర్ఆర్ఆర్ ఇంత అద్భుతంగా వచ్చేది కాదు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో తారక్ ఫ్యాన్స్ కొద్దిగా శాంతిస్తారేమో చూడాలి.
Also Read
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
- Tags
- latest news
- ntr
- rajamouli
- Ram Charan
- rrr
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!