రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సలార్ ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన సలార్ సినిమా యునానిమస్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి హిట్ కొడితే ఎలా ఉంటుందో మూవీ లవర్స్ చూస్తున్నారు. ఎలివేషన్స్, హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్స్, గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ తో సలార్ సినిమాని నింపేసాడు ప్రశాంత్ నీల్. సలార్ సీజ్ ఫైర్ సినిమా చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లోకి వచ్చేసారు. ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ సినిమాని ఎన్టీఆర్ తోనే చేస్తున్నాడు. ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా 2024 ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.
సరిగ్గా నాలుగు నెలల్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ లు కలిస్తే అది ఫైర్ హౌజ్ కాంబినేషన్ అవుతుంది. యష్, ప్రభాస్ లని ఈ రేంజులో చూపించిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కి ఇవ్వబోయే ఎలివేషన్స్ ని తలుచుకుంటూ సోషల్ మీడియాలో #NTRNeel ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్-నీల్ కలిసి చేయబోయే సినిమాని ప్రశాంత్ నీల్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాడు. మరి రెగ్యులర్ సినిమానే పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అయ్యేలా చేసే ప్రశాంత్ నీల్… తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో ఎలా చేస్తాడో అర్ధం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ దేవర, వార్ 2 షూటింగ్స్ కంప్లీట్ అవ్వగానే ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తో చేసే సౌండ్ ఏ రేంజులో ఉంటుందో చూడాలి.