Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తారక్ పుట్టినరోజు కానుకగా మే 20న రాబోయే ‘డ్రాగన్’ అప్డేట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే, ఒకరోజు ముందుగానే అంటే మే 19 అర్ధరాత్రి ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలి సోషల్ మీడియాను షేక్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను కేవలం సౌత్ కే పరిమితం చేయకుండా, నేషనల్ లెవల్లో భారీగా ప్లాన్ చేశారు. దీనికోసం ఎన్టీఆర్ స్వయంగా ముంబై వెళ్లనున్నారు. అక్కడ జాతీయ మీడియా సమక్షంలో ఈ ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్‌ను ప్రెజెంట్ చేయబోతున్నారు.
‘సలార్’ వంటి భారీ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో బాలీవుడ్ వర్గాల్లో కూడా ఈ ప్రాజెక్టుపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. అందుకే ప్రమోషన్లను ముంబై నుంచే గ్రాండ్‌గా మొదలుపెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకు అదిరిపోయే బిజియం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 11, 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ గ్లింప్స్‌తో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద తారక్ మరోసారి తన సత్తా చాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!