ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న “ఎవరు మీలో కోటీశ్వరులు” గేమ్ షో చివరి ఎపిసోడ్ నిన్న ప్రసారమైంది. ఈ ఎపిసోడ్ లో మహేష్ బాబు అతిథిగా సందడి చేశారు. షోలో మహేష్, ఎన్టీఆర్ మధ్య జరిగిన సరదా సంభాషణ ఆకట్టుకుంది. ఈ వినోదభరితమైన ఎపిసోడ్ లో మహేష్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు చాలానే రాబట్టాడు ఎన్టీఆర్. హాట్ సీట్ లో కూర్చున్న మహేష్ బాబు సైతం ఎన్టీఆర్ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ లో మహేష్, ఎన్టీఆర్ ఒకరినొకరు టీజ్ చేసుకోవడమే కాకుండా సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ ఒకానొక సందర్భంలో మహేష్ లాంటి వారిని చూస్తే తనకు ఈర్ష్యగా ఉంటుందని అన్నారు.
Read Also : “అఖండ” థియేటర్లో అగ్ని ప్రమాదం
షోలో భాగంగా కుటుంబం గురించి మాట్లాడుతూ మహేష్ కూతురు సితారతో తన బంధాన్ని పంచుకున్నాడు. “సితారతో నా సంబంధం రోజురోజుకూ మరింత పెరుగుతోంది. తండ్రి కావడం చాలా గొప్ప అనుభూతి. సితారతో తండ్రిగా ప్రతి బిట్ ను ఆనందిస్తా’’ అంటూ తన కూతురిపై ప్రశంసలు కురిపించారు మహేష్. అయితే ఇదంతా చూసిన ఎన్టీఆర్… కూతుళ్లు ఉన్నవాళ్లను చూస్తే తనకు ఈర్ష్యగా అనిపిస్తుందని వెల్లడించారు. తనకు ఇద్దరూ మగపిల్లలు కావడంతో కూతురు లేకపోవడం కాస్త వెలితిగా అన్పిస్తుందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు.