NTR: ఆ నవ్వు చాలు సామీ.. బతికేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం.. దేవర సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే దేవర ఫస్ట్ లుక్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఎన్టీఆర్.. ఒకపక్క సినిమాలతో పాటు ఇంకోపక్క వాణిజ్య ప్రకటనలను కూడా చేస్తూ ఉంటాడు. నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా నేడు ఎన్టీఆర్.. ఒక యాడ్ షూట్ లో పాల్గొన్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ యాడ్ షూట్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా కూడా ఎన్టీఆర్ లుక్ మాత్రం అదిరిపోయింది.
Samantha: నాగ చైతన్య ప్లేస్ ను అతనితో రీప్లేస్ చేస్తున్న సమంత..?
Also Read
వైట్ షర్ట్ లో ఎన్టీఆర్ మూడ్స్ మారుస్తూ దిగిన ఫొటోస్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ నవ్వుతున్న ఫోటో అయితే ఎన్టీఆర్ అభిమానుల డీపీగా మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్ అదరగొట్టేశాడు, ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఈ యాడ్ షూట్ ను నిర్వహించాడు. అతనే ఈ ఫోటోలను షేర్ చేశాడు. పోస్ట్ ప్యాకప్ షూట్ లో ఎన్టీఆర్ సూపర్ క్యాండీడ్ నవ్వు అంటూ క్యాప్షన్ కూడాఇచ్చాడు. ఇక అంత నిష్కపటమైన చిరునవ్వును ఎక్కడా చూడలేదని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ఆ ఫోటో చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్ సైతం.. ఆ నవ్వు చాలు సామీ .. బతికేస్తాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడమే కాదు ట్రెండింగ్ గా మారాయి.
తాజావార్తలు
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్‌వెల్‌లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్‌లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..