NTR: హిందీలో యన్టీఆర్ ఫ్యామిలీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR: హిందీ చిత్రసీమలోకి యంగ్ టైగర్ యన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలయికలో రూపొందిన ‘వార్’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందే చిత్రంతో జూనియర్ యన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయమని హిందీ సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో హైదరాబాద్ లోని యన్టీఆర్ సన్నిహితులు పైకి ఏమీ చెప్పకున్నా, జూనియర్ హిందీ సినిమా ఎంట్రీ భారీ స్థాయిలోనే ఉంటుందని అంటున్నారు. ఈ హిందీ చిత్రంలో హృతిక్ రోషన్ కూడా కలసి జూనియర్ తో నటిస్తారనీ సమాచారం. ఒకప్పుడు ఇండియాలో టాప్ డాన్సర్స్ సర్వేలో నంబర్ వన్ స్థానం జూనియర్ ఆక్రమించగా, తరువాతి స్థానంలో అల్లు అర్జున్, మూడో స్థానంలో హృతిక్ రోషన్ నిలిచారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు టాప్ డాన్సర్స్ కలసి నటిస్తే, అందులో వారిద్దరిపై కలిపి ఓ పాటను చిత్రీకరిస్తే అది తప్పకుండా “నాటు నాటు…” సాంగ్ ను మించిపోతుందనీ బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా యంగ్ టైగర్ యన్టీఆర్ హిందీ సినిమా ఎంట్రీ మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశమయింది.
ఇప్పటి దాకా తాను నటించిన అనువాద చిత్రాలతోనే హిందీ జనాన్ని పలకరించిన జూనియర్, ఈ సారి నేరుగా హిందీ సినిమాలోనే నటించడం అక్కడి వారికీ ఆనందం పంచుతోంది. నందమూరి నటవంశానికి మూలపురుషుడైన నటరత్న యన్టీఆర్ ఆరంభంలోనే హిందీ చిత్రాలలో నటించారు. యన్టీఆర్ హీరోగా కేవీ రెడ్డి రూపొందించిన ‘పాతాళభైరవి’ (1952) హిందీలోనూ రీమేక్ అయింది. అక్కడ సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. తరువాత మహానటి భానుమతి స్వీయదర్శకత్వంలో నటించి, నిర్మించిన త్రిభాషా చిత్రం (తెలుగు, తమిళ, హిందీ)- ఆ నాటి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘చండీరాణి’ (1953)లోనూ రామారావు హీరోగా నటించారు. ఈ సినిమా తెలుగులో కంటే హిందీలోనే మంచి విజయాన్ని సాధించడం విశేషం. ఆ పై యన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రం ‘సంతోషం'(1955)ను తెలుగు, హిందీ భాషల్లో జూపిటర్ సంస్థ నిర్మించింది. హిందీలో ఈ చిత్రం ‘నయా ఆద్మీ’పేరుతో విడుదలై ముంబైలో 42 వారాలు ప్రదర్శితమయింది. ఇలా యన్టీఆర్ హిందీలో నటించిన మూడు చిత్రాలు విజయాన్ని చవిచూశాయి. ఇక ఆయన నటించిన “లవకుశ, నర్తనశాల, పాండవవనవాసము” వంటి పౌరాణికాలు హిందీలోకి అనువాదమై అక్కడా రజతోత్సవాలు జరుపుకున్నాయి. యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ నటించిన పలు చిత్రాలు హిందీలోకి అనువాదమయ్యాయి. 1992లో బాలకృష్ణ ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ హిందీలో డబ్ అయి సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం! ఇక నందమూరి నటవంశం మూడోతరం హీరో అయిన జూనియర్ నటించిన అనేక సినిమాలు హిందీలోకి డబ్బింగ్ అయి, అలరించాయి. గత యేడాది పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘ట్రిపుల్ ఆర్’తో జూనియర్ మరింతగా ఉత్తరాదివారిని ఆకట్టుకున్నారు. సదా తన తాతను స్మరిస్తూ ఆయన బాటలోనే పయనిస్తున్నానని చెప్పుకొనే జూనియర్ యన్టీఆర్ మరి హిందీలో నటించబోయే తొలి చిత్రంతో ఏలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి.
Also Read
- The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. 'ది పారడైజ్' సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
- Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
తాజావార్తలు
-
The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
-
Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
-
Maharashtra Hill Tragedy: తల్లిదండ్రులను కలపాలని కునాల్ చనిపోయాడా? సంభాజీనగర్ ఎపిసోడ్లో న్యూ ట్విస్ట్!
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?