NTRNeel : ఎన్టీఆర్ బర్త్‌డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే డబుల్ ధమాకా అప్డేట్స్ సిద్ధమయ్యాయి. సోషల్ మీడియాలో , ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్న తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ బర్త్‌డే వేడుకలను అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్యాన్స్‌కు రోమాలు నిక్కబొడుచుకునే రేంజ్లో రెండు భారీ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి.
సంచలనాల దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్కు ‘డ్రాగన్’ (DRAGON) అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్/టీజర్ కట్ ఇప్పటికే పూర్తయింది. సెన్సార్ బోర్డులో ‘గ్లింప్స్ ఆఫ్ డ్రాగన్’ పేరుతో సర్టిఫికేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. అయితే, అందరినీ విస్తుపోయేలా చేస్తూ ఈ గ్లింప్స్ రన్ టైమ్ ఏకంగా 4 నిమిషాల 35 సెకన్లు ఉండబోతోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక సినిమా గ్లింప్స్ లేదా టీజర్ ఈ స్థాయి నిడివితో రావడం బహుశా ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రశాంత్ నీల్ మార్క్ భారీ యాక్షన్ ఎలివేషన్స్, గూస్బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ వీడియో అభిమానులకు పక్కా ఐ-ఫీస్ట్‌లా ఉండబోతోంది. దానికి సంబంధించిన పనుల్లోనే దర్శకుడు నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
- Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
ఇక డబుల్ ధమాకాలో భాగంగా రెండవ సర్ప్రైజ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఉండబోతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అరవింద సమేత’ భారీ విజయం సాధించడంతో, ఈసారి మైథలాజికల్ (పౌరాణిక) టచ్ ఉన్న ఒక భారీ సోషియో-ఫాంటసీ కథతో రాబోతున్నారు. ఈ చిత్రానికి ‘God of War’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ పుట్టినరోజునే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ వీడియో లేదా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకే రోజు టాలీవుడ్ ఇద్దరు టాప్ డైరెక్టర్ల నుండి రాబోతున్న ఈ అప్డేట్స్తో బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!