యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనగానే హై ఇంటెన్స్ పెర్ఫర్మార్ గుర్తొస్తాడు. లెంగ్త్ ఉన్న డైలాగులని, కత్తి పట్టుకోని విలన్స్ ని తెగ నరికే యాక్షన్ ఎపిసోడ్స్ ని, మెలికలు తిరిగే డాన్స్ సీక్వెన్లని అవలీలగా చెయ్యడంలో ఎన్టీఆర్ దిట్ట. ఎలాంటి సీన్ ని అయినా ఎఫోర్ట్ లెస్ గా చెయ్యగల ఎన్టీఆర్ మాస్ సినిమాలకి, కమర్షియల్ ఫార్మాట్ సినిమాలకి పెట్టింది పేరు. అందుకే ఎన్టీఆర్ సినిమాలు చూస్తే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. యంగ్ ఏజ్ నుంచి ఈ సినిమాలు చేస్తూనే ఎన్టీఆర్ మాన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ ని సొంతం చేసుకున్నాడు. ఈ జనరేషన్ చూసిన బిగ్గెస్ట్ మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ ని కామెడీ రోల్ చేస్తే చూడగలమా? అసలు ఏ డైరెక్టర్ అయినా ఎన్టీఆర్ ని అలా ఊహించే సాహసం చెయ్యగలడా? అది కూడా ఆది, సాంబ లాంటి యాక్షన్ సినిమాలు చేసిన వినాయక్ లాంటి డైరెక్టర్ ఎన్టీఆర్ ని అలా కలలో అయినా ఊహిస్తాడని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎక్స్పెక్ట్ ది అన్-ఎక్స్పెక్ట్డ్ అన్నట్లు ఎన్టీఆర్ ని ఆదిగా చూపించి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన వినాయక్, ఎన్టీఆర్ తో ‘అదుర్స్’ సినిమా చేశాడు. ఎన్టీఆర్ సీరియస్ రోల్స్ మాత్రమే కాదు ఏ రోల్ ని అయినా అద్భుతంగా చెయ్యగల కంప్లీట్ యాక్టర్ అని ప్రూవ్ చేసింది అదుర్స్ సినిమా.
2010 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. నిజానికి అదుర్స్ మూవీలో అంత గొప్ప కథేమి ఉండదు, దాన్ని అంత గొప్పగా మార్చింది ఎన్టీఆర్ నటన మాత్రమే. ఎన్టీఆర్ ని చూసి మీసాలు తిప్పే వాళ్లు కూడా నవ్వుకున్నారు అంటే అదుర్స్ సినిమా ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు కానీ చారీ క్యారెక్టర్ లో అద్భుతమే చేసి చూపించాడు. బ్రహ్మీతో, బ్రహ్మికి పోటీగా ఎన్టీఆర్ చారీ పాత్రలో చేసిన కామెడీ సూపర్బ్ ఉంటుంది. ఈ రోల్ లో ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ఆల్ టైం బెస్ట్ గా ఉంటుంది. ఎన్టీఆర్ కెరీర్ కి చేంజ్ ఓవర్ ప్రాజెక్ట్ గా నిలిచిన అదుర్స్ సినిమా మార్చ్ 4న మళ్లీ రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ రెడీ అయ్యారు. మార్చ్ 4న అదుర్స్ స్పెషల్ షోస్ తెలుగు రాష్ట్రాల్లో పడనున్నాయి. ఎన్టీఆర్ ఫాన్స్ కి మాత్రమే కాకుండా సినీ అభిమానులందరికీ ఇష్టమైన అదుర్స్ మూవీని స్పెషల్ షోస్ వెయ్యడం అనేది ఎవరి ఆలోచనో తెలియదు కానీ ఆ రోజు ఆడియన్స్ థియేటర్స్ వెళ్లడం మాత్రం గ్యారెంటీ.
Young tiger @tarak9999 's Blockbuster entertainer, #Adhurs Special Shows Across WORLD WIDE On This March 4th 🌍🔥#AdhursSpecialShows #ManOfMassesNTR pic.twitter.com/zp8y5SoXUN
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 11, 2023