సలార్ సినిమాతో డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానున్న ప్రశాంత్ నీల్… టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ 2024 ఏప్రిల్ నుంచి షూటింగ్ కి వెళ్తుంది. NTR 31 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ సినిమాని ప్రశాంత్ నీల్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్తున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమాలు మామూలుగానే భారీగా ఉంటాయి ఇక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏ రేంజులో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రశాంత్ నీల్ NTR 31 షూటింగ్ ని 18 దేశాల్లో ప్లాన్ చేసాడట. దాదాపు సినిమా మొత్తం ఓవర్సీస్ లోనే జరుగుతుందని టాక్.
18 దేశాలు, కంప్లీట్ ఓవర్సీస్ షూటింగ్ తో పాటు NTR31 గురించి వినిపిస్తున్న ఇంకో వార్త… ఈ సినిమా చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ నేపథ్యంలో ఉండనుందట. ఉక్రెయిన్ లోని కీవ్ ప్రాంతంలో 37 ఏళ్ల క్రితం అంటే 26 ఏప్రిల్ 1986న న్యూక్లియర్ డిజాస్టర్ జరిగింది. ఈ డిజాస్టర్ ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. చెర్నోబిల్ నేపథ్యంలోనే కథని రాసుకున్న ప్రశాంత్ నీల్… ఈ కారణంగానే ఎన్టీఆర్ కి కలిసిన ప్రతిసారి రేడియేషన్ సూట్ తెచ్చుకోవాలి, న్యూక్లియర్ పవర్ అంటూ ట్వీట్స్ చేస్తుండొచ్చు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనే విషయం ప్రశాంత్ నీల్ కే తెలియాలి కానీ ఇప్పటికైతే చెర్నోబిల్ నేపథ్యంలోనే ఎన్టీఆర్ 31 ఉంటే మాత్రం… ఎన్టీఆర్ పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నట్లే.