మార్చ్ 5 నుంచి మార్చ్ 14 వరకూ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ క్యాంపెయిన్ లో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు హైదరాబాద్ కి తిరిగి వచ్చేసాడు. ఎన్టీఆర్ వస్తున్నాడు అనే విషయం తెలిసి నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్ చేరుకోని, ఎన్టీఆర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక్కడితో ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ కథ ముగిసింది. ఇక ఎన్టీఆర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా కథ మొదలవ్వాలి. ఆస్కార్ ఈవెంట్స్ లో కొరటాల శివతో చేస్తున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా గురించి మాట్లాడిన ఎన్టీఆర్, మార్చ్ 30 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేశాడు. ఉగాది పండగ సంధర్భంగా ‘ఎన్టీఆర్ 30’ పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఆ తర్వాతి వారం నుంచే రెగ్యులర్ షూటింగ్ కోసం కొరటాల శివ, ఎన్టీఆర్ లు సెట్స్ పైకి వెళ్లబోతున్నారు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ కంప్లీట్ చేసిన కొరటాల శివ, బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో ‘ఎన్టీఆర్ 30’ షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసే ఛాన్స్ ఉంది.
ఈ పాన్ ఇండియా మూవీలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు ‘జాన్వీ కపూర్’ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయంలో ఇటివలే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇక నెక్స్ట్ వీక్ నుంచి ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. పూజా కార్యక్రమాలు, షూట్ ఫస్ట్ డే… ఇలా బ్యాక్ టు బ్యాక్ జరగనున్న ఈవెంట్స్ నుంచి ఎన్టీఆర్ ఫోటోలు బయటకి వస్తూనే ఉంటాయి కాబట్టి ఎన్టీఆర్ ఫాన్స్ ఇక ‘ఎన్టీఆర్ 30’ ట్యాగ్ ని నేషనల్ వైడ్ ట్రెండ్ చేసే పనిలో ఉంటారు. ఇదిలా ఉంటే ‘ఎన్టీఆర్ 30’ సినిమాలో శ్రీకాంత్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు అనే వార్త వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.