స్కంద సినిమా చూసి… థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పుడు… అరే మావా ఇదేం మాస్, ఇదేం నరుకుడు అనుకున్నారు ఆడియెన్స్ అంతా. మాస్ యందు బోయపాటి మాస్ వేరన్నట్టు… స్కందను ఊరమాస్‌గా తెరకెక్కించాడు బోయపాటి. మాస్ డోస్ ఎక్కువవడంతో.. జనాలు తట్టుకోలేకపోయారు. పైగా ఈ సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశాడు. దీంతో బాబోయ్.. ఇంత మాస్ సినిమాకు సెకండ్ పార్ట్ అవసరమా? అనే కామెంట్స్ మొదలయ్యాయి. ఇప్పుడదే నిజమైనట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ వసూళ్లు మాత్రం అనుకున్న రేంజ్‌లో రాలేదు. దీంతో స్కందకు నష్టం తప్పదంటున్నారు. పార్ట్ 1 లాస్ ఫేస్ చేస్తే సీక్వెల్ ఎందుకు అనే ఆలోచన మొదలవ్వడంలో తప్పు లేదు. అందుకే.. స్కంద సీక్వెల్ క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తోంది.
స్కంద 2 క్యాన్సిల్ ప్రస్తుతానికి అయినా లాంగ్ రన్ లో బోయపాటి స్కంద 2 వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే స్కంద 2 లేదు. ఇప్పుడు బోయపాటి నెక్స్ట్ సినిమా ఎవరితో అనే డిస్కషన్ మొదలయ్యింది. బాలయ్యతో ఏకాండ 2 ప్రీప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాడా? అల్లు అర్జున్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడా? లేక సూర్య సినిమాకి జై కొడతాడా అనేది చూడాలి. అయితే అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఫ్రీ అవ్వడు. సూర్య కూడా కంగువా సినిమా కంప్లీట్ అయ్యే వరకూ ఫ్రీ అవ్వడు, కంగువా అయిపోగానే వెట్రిమారన్ ప్రాజెక్ట్ రెడీగా ఉంది. సో అది కూడా అయిన తర్వాతే బోయపాటితో సూర్య సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఈ రెండు సినిమాలు సెట్ అవ్వడం అనేది ఇప్పట్లో అయ్యే పని కాదు కాబట్టి బోయపాటి శ్రీను ముందున్న ఏకైక ఆప్షన్ అఖండ 2. అయితే ఇక్కడ కూడా లిటిగేషన్ ఉంది, అఖండ 2 స్టార్ట్ అవ్వాలి అంటే బాలయ్య-బాబీ సినిమా సినిమా కంప్లీట్ అవ్వాలి. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతుంది కాబట్టి బోయపాటి స్క్రిప్ట్ వర్క్ చేసుకోవడానికి తగినంత టైమ్ ఉంది.