Aishwarya Rajesh : బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా తెలుగులో సినిమాలు లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది నవ్వులతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లు. సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వెంకీ, ఐశ్వర్య కెమిస్ట్రీ, బుల్లి రాజ్ డైలాగులు బాగా పేలాయి. అనిల్ రావిపూడితో పాటు వెంకీ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం. ఇక భాగ్యంగా ఐశ్వర్య నటన టాప్ నాచ్. బావ అంటూ ఓ వైపు అమాయకమైన పల్లెటూరి గృహిణిగా మరో వైపు గడుసు పెళ్లాంగా బాగా ఆకట్టుకుంది. నలుగురు పిల్లల తల్లిగా రిస్క్ కూడా చేసింది.
Also Read : ARYA -2 : ఆర్య 2 రీరిలీజ్.. సంధ్య థియేటర్ వద్ద భారీ పోలీస్ బందోబస్త్
Also Read
- Dhanush - Mrunal Thakur: ఇన్నాళ్లూ సీక్రెట్‌గా లవ్.. ఇప్పుడు సైలెంట్‌గా విడిపోయారా?
- Prabhas: ఆ సీన్ చూసి ఏడ్చేశా.. షూటింగ్ గ్యాప్‌లో ప్రభాస్ ఎమోషనల్! అసలు ఏం జరిగిందంటే?
- Prabhas: ప్రభాస్ మొబైల్ వాల్‌పేపర్ లీక్.. డార్లింగ్ ఫోన్ స్క్రీన్‌పై అదిరిపోయే ఫోటో!
- Actress Rohini: రఘువరన్ నన్ను హౌస్‌వైఫ్‌గా ఉండమన్నాడు.. అందుకే సినిమాలకు దూరమయ్యాను: నటి రోహిణి
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో టాలీవుడ్ లో ఐశ్వర్య బిజీగా మారిపోతుందేమో అనుకుంటే ఇప్పటి వరకు ఒక్క తెలుగు ప్రాజెక్టుకు సైన్ చేసిన దాఖలాలు లేవు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత సుడుల్ వెబ్ సిరీస్‌తో పలకరించింది ఐశ్వర్య. తెలుగమ్మాయిగా తెలుగులో సినిమాలు చేయాలని తన వంతు ప్రయత్నిస్తున్నా ఆఫర్లు మాత్రం రావట్లేదో ఇవ్వట్లేదో తెలియట్లేదే. గతంలో ఓసారి టాలీవుడ్ నుండి ఛాన్సులు రాకపోవడంపై బహిరంగానే అసహనం వ్యక్తం చేసింది ఐషూ. కౌసల్య కృష్ణమూర్తితో టాలీవుడ్ తెరంగేట్రం చేసి ఆరేళ్లవుతున్నా పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు ఐశ్వర్య. తెలుగు కాదంటోన్నా, తమిళంలో వరుస ఆఫర్లను కొల్లగొడుతోంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆమెకు మూడు సినిమాలున్నాయి. కరూప్పార్ నగరం, మోహన్ దాస్ షూటింగ్స్ కంప్లీట్ కాగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. అలాగే తీయవర్ కులైగల్ నడుంగ చేస్తుంది. అలాగే కన్నడలోకి ఎంట్రీ ఇస్తోంది ఈ షైనింగ్ బ్యూటీ. ఉత్తరాఖండ సినిమా ఎప్పుడో స్టార్టైనా ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. మరి టాలీవుడ్ లో ఎవరు అవకాశం ఇస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్‌రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
-
Hashmatullah Shahidi: భారత్‌పై కెప్టెన్ చారిత్రాత్మక శతకం… ఒంటరి పోరాటంతో సరికొత్త రికార్డు..
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
NEET Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ సెంటర్.. అసలు నిజం ఇదే..
-
Railway Rules: టికెట్ లేని ప్రయాణంపై రైల్వే రూల్స్ చేంజ్.. ఇకపై డబుల్ పెనాల్టీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..