Babar Azam: “వరల్డ్ రికార్డ్ బద్దలు”.. విరాట్‌ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్.. మూడో స్థానానికి పడిపోయిన కోహ్లీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babar Azam: బాబర్ ఆజమ్ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు చేరింది. వన్డే క్రికెట్ చరిత్రలో 141 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కడంతో పాటు, ఈ జాబితాలో విరాట్ కోహ్లీని మూడో స్థానానికి నెట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే ముక్కోణపు సిరీస్‌లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీ చేయలేకపోయినా, కీలకమైన 45 పరుగుల ఇన్నింగ్స్‌తో అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 16,000 పరుగులు పూర్తి చేసుకున్న ఐదో పాకిస్థాన్ బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా, తన వన్డే కెరీర్లో 141వ ఇన్నింగ్స్ ఆడిన బాబర్.. వన్డేల్లో 141 ఇన్నింగ్స్‌ల ఆడి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం వన్డేల్లో అతని ఖాతాలో 53.37 సగటుతో 6,671 పరుగులు ఉన్నాయి. ఇందులో 20 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికా మాజీ ఓపెనర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. వన్డేల్లో అత్యంత వేగంగా పరుగుల మైలురాళ్లను అందుకోవడంలో ఆమ్లా ఒకప్పుడు విరాట్ కోహ్లీని కూడా వెనక్కి నెట్టాడు. 141 వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఆమ్లా 6,626 పరుగులు చేసి టాప్‌లో ఉండగా, ఇప్పుడు అతని కంటే 45 పరుగులు ఎక్కువగా చేసిన బాబర్ ఆజమ్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే.. తన తొలి 141 వన్డే ఇన్నింగ్స్‌ల తర్వాత 6,224 పరుగులు మాత్రమే చేసి ఈ జాబితాలో మూడో స్థానానికి పడిపోయాడు. అయితే, ఓవరాల్‌గా వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో మాత్రం కోహ్లీ 305 ఇన్నింగ్స్‌ల్లో 58.78 సగటుతో 15,109 పరుగులు చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే వన్డేల్లో అత్యధికంగా 55 సెంచరీలు బాదిన ప్రపంచ రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది.
Also Read
- DA Hike: ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?
- Dussehra History: విజయదశమి, ఆయుధ పూజల వెనుక మరాఠా, రాజపుత్రుల వీర చరిత్ర!
- Canadian Military: కెనడా మిలిటరీ శిక్షణలో తీవ్ర విషాదం.. నలుగురు సైనికులు మృతి, 39 మందికి గాయాలు
- Marigold Farmers: దసరా వేళ బంతిపూలకు ధరలేవీ? రైతులకు తీవ్ర నిరాశ!
ఇక, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య పాకిస్థాన్ వేదికగా ట్రై సిరీస్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది నేతృత్వంలోని పాక్ జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టులో సల్మాన్ అలీ ఆగా (Salman Ali Agha) సెంచరీ చేశాడు. దీంతో పాక్ లంక ముందు 306 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. సల్మాన్ ఆగా 90 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో అజేయంగా 107 పరుగులు సాధించాడు. అయితే ఆయన మినహా మిగతా బ్యాటర్లెవరూ హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకను పాక్ బౌలర్లు కట్టడి చేయడంతో ఆ జట్టు 268 పరుగులకే కుప్పకూలింది. దీంతో పాకిస్థాన్ ఈ సిరీస్‌ను విజయంతో ఆరంభించింది.
తాజావార్తలు
-
Babar Azam: “వరల్డ్ రికార్డ్ బద్దలు”.. విరాట్‌ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్.. మూడో స్థానానికి పడిపోయిన కోహ్లీ..
-
DA Hike: ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్ డేట్ ఫిక్స్.. 9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా
-
Vijay Deverakonda: యాక్షన్‌కు బ్రేక్.. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం విజయ్ దేవరకొండ కొత్త ప్లాన్!
-
Dussehra History: విజయదశమి, ఆయుధ పూజల వెనుక మరాఠా, రాజపుత్రుల వీర చరిత్ర!
ట్రెండింగ్
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!