స్మృతీ ఇరానీకి చేదు అనుభవం… అతిథిగా ఆహ్వానించిన షోకే ‘నో ఎంట్రీ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటి, మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి చేదు అనుభవం ఎదురైంది. అతిథిగా ఆహ్వానించిన షోకే ‘నో ఎంట్రీ’ అనడంలో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది ఆమె. ఇటీవలే రచయిత్రిగా మారిన స్మృతి తన బుక్ ను ప్రమోట్ చేసుకోవడానికి పాపులర్ టెలివిజన్ కపిల్ శర్మ కామెడీ షోలో అతిథిగా పాల్గొనాల్సి ఉంది స్మృతి. అయితే దీనికి సంబంధించిన షూటింగ్ కోసం ఆమె లొకేషన్ సెట్ కు చేరుకోగా, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఆమెను లోపలకు అనుమతించడానికి నిరాకరించాడట. ఈ షోకు తాను గెస్ట్ అని చెప్పినప్పటికీ దీని గురించి మాకెలాంటి సమాచారం లేదు మేడం… సారీ అంటూ ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టారట. ఈ పరిణామంతో స్మృతి వెనుదిరగక తప్పలేదు. అయితే ఇదంతా సెట్ లోపల బిజీగా ఉన్న కపిల్ శర్మ అండ్ టీంకు అస్సలు తెలియదట.
Read Also : “లైగర్” దూకుడు… అప్డేట్స్ కోసం మేకర్స్ సన్నాహాలు
Also Read
తీరా జరిగిన విషయం తెలిశాక సెట్ లో గందరగోళం నెలకొంది. అంతేకాదు షూటింగ్ కు ప్యాకప్ కూడా చెప్పేశారు. అంతేకాదు స్మృతి ఇరానీకి కపిల్ శర్మ అండ్ టీం జరిగిన దానికి క్షమించమని కోరారట. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. కపిల్ శర్మ షో మేకర్స్ కావాలనే ఇలా చేశారని, స్మృతి ఇరానీ ఒక రాజకీయ వేత్త, నటి కూడా… ఆమె గురించి తెలియనివారు ఉండరు… అలాంటిది ఆమెను ఇలా సెట్ లోకి అనుమంతించకుండా ఎలా ప్రవర్తిస్తారు అంటూ మండిపడుతున్నారు ఆమె అభిమానులు. అయితే త్వరలో ప్రసారం కానున్న షోలో అసలేం జరిగింది అనే విషయంపై క్లారిటీ ఇచ్చి ఈ పుకార్లను చెక్ పెట్టాలని కపిల్ శర్మ షో మేకర్స్ భావిస్తున్నారట.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..