No budget Experimental Film ‘1134’ Received Clean U Censor Certificate: కాన్సెప్ట్ ఓరియెంటెడ్, డిఫరెంట్ టేకింగ్, మేకింగ్‌తో కొత్త దర్శకులు ప్రయోగాలు చేస్తూన్నారు. ప్రస్తుతం ఆడియన్స్ సైతం రొటీన్ ఫార్ములా సినిమాలకి తెరపై చూసేందుకు అంతగా ఇష్టపడటం లేదు, కేవలం డిఫరెంట్ మూవీస్‌కు థియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఇలాంటి సమయంలో రాబోతున్న ఓ డిఫరెంట్ ప్రయోగమే ‘1134’ సినిమా. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లర్ జానర్ లో సాగే ఈ సినిమాను నూతన దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి తెరకెక్కించారు. శాన్వీ మీడియా బ్యానర్ మీద రాబోతోన్న ఈ సినిమాకి భరత్ కుమార్ పాలకుర్తి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగనుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తవగా సెన్సార్ నుంచి ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. రాంధుని క్రియేషన్స్, శాన్వీ మీడియా బ్యానర్‌లపై తెరకెక్కిన ఈ 1134 చిత్రంలో కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్,నర్సింగ్ వాడేకర్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ మురళీ కార్తికేయ సంగీతం అందించారు. నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. శ్రీ మురళీ కార్తికేయ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి నజీబ్ షేక్, జితేందర్ తలకంటి డీఓపీగా వ్యవహరించారు.