Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News No Actor Is Better Than A Producer Bekkem Venugopal

Tollywood: నిర్మాతను మించిన నటుడు ఎవరూ వుండరు: బెక్కెం వేణుగోపాల్

Published Date :April 26, 2023 , 6:17 pm
By Omprakash Vaddi
Tollywood: నిర్మాతను మించిన నటుడు ఎవరూ వుండరు: బెక్కెం వేణుగోపాల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bekkem Venu:’టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా ప్రస్థానం మొదలుపెట్టి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు బెక్కెం వేణుగోపాల్. “సత్యభామ, నేను లోకల్, పాగల్, ప్రేమ ఇష్క్ కాదల్, సినిమా చూపిస్తా మామ, హుషారు” వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా గుర్తింపు పొందిన బెక్కెం వేణుగోపాల్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా వున్నారు. ఏప్రిల్ 27న పుట్టిన రోజును పురస్కరించుకుని బెక్కెం వేణుగోపాల్ తన సినీ ప్రయాణం గురించి మాట్లాడారు. తన తొలి అడుగులను గుర్తు చేసుకుంటూ, “2006 అక్టోబర్ 12న నిర్మాతగా నా తొలి చిత్రం ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ విడుదలై విజయవంతమైంది. అక్కడి నుంచి 16 సంవత్సరాలు గడిచిపోయింది. సినిమా తప్ప వేరే వ్యాపకం, బిజినెస్ నాకు లేదు. సినిమా తరువాత సినిమా చేస్తూ వచ్చాను. నిర్మాతగా 12 సినిమాలు, వేరే బ్యానర్లతో కలిసి 4 సినిమాలు నిర్మించాను. డబ్బుల గురించి చెప్పను కానీ అంతకంటే విలువైన అనుభవం సంపాందించాను. నిర్మాతగా ప్రతి సినిమాను ఇష్టంగా నిర్మించాను. సూపర్‌స్టార్ కృష్ణగారి సినిమా షూటింగ్ చూద్దామని వచ్చిన నేను ఈ రోజు నిర్మాతగా ఎదగడం, నాకు ఇష్టమైన సినిమా రంగంలో ఉండటం ఎంతో తృప్తిని కలిగిస్తోంది” అన్నారు.
ఇటీవల విడుదలైన తాజా చిత్రం ‘అల్లూరి’ గురించి చెబుతూ, “మా సినిమాకు విడుదల సమయంలో జరిగింది కాకుండా వేరే విషయాలు మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటికీ హీరో శ్రీవిష్ణుతో నాకు మంచి రిలేషన్ వుంది. ఈ విషయంలో నేను మాట్లాడటం కంటే శ్రీవిష్ణు మాట్లాడితేనే బాగుంటుంది. నిజానికి ఆ సినిమా విడుదల కూడా ఎక్కడా ఆగలేదు. మార్నింగ్ షో కాస్త ఆలస్యంగా పడింది. అంతే తప్ప అంతకు మించి ఏమీ జరగలేదు. ప్రతి సినిమాకు జరిగే గొడవలే! ఆ సినిమాకు జరిగిన అనుభవాలు నాకు పాఠాలు నేర్పాయి. సినిమా ఇష్టంగా చేశాను. అది గొప్ప సినిమా కాకపోవచ్చు కానీ బ్యాడ్ సినిమా కాదు” అని అన్నారు. ‘దిల్’ రాజుతో అనుబంధం గురించి వివరిస్తూ, “మా జర్నీకి దిష్టి తగలకూడదని కోరుకుంటున్నాను. ‘దిల్’ రాజు సపోర్ట్ నాకు ఎప్పుడూ వుంటుంది. ఆయన జడ్జిమెంట్‌పై నాకు ఎంతో నమ్మకం” అని తెలిపారు. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి వివరిస్తూ, “కొత్తవాళ్లతో ‘రోటి, కపడా, రొమాన్స్’ అనే సినిమాతో పాటు నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి సుడిగాలి సుధీర్‌తో ఓ మూవీ చేస్తున్నాను. ‘పాగల్’ ఫేమ్ నరేశ్ కుప్పిలి దీనికి దర్శకుడు. వీటితో పాటు ఓటీటీ కోసం అవికాగోర్ ప్రధాన పాత్రలో స్వరూప్ దర్శకత్వంలో ఓ క్రేజీ థ్రిల్లర్ చేస్తున్నాం” అని అన్నారు.
ఇవాళ్టి నిర్మాతల పరిస్థితి చెబుతూ, “నిర్మాతది ఎప్పుడూ క్లిష్ట పరిస్థితే. సినిమా మీద నాలెడ్జ్ వున్న వాళ్లు, అనుభవం వున్నవాళ్ళు తీసిన సినిమాల్లో సక్సెస్ రేట్ ఎక్కువ. అనుభవంతో పాటు సినిమా మీద అంకితభావం వుండాలి. అప్పుడే నిర్మాతగా సక్సెస్ సాధిస్తారు. అయితే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కథ కంటే కాంబినేషన్ నమ్ముకుని ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. దాని వల్ల సినిమా సూపర్‌హిట్ అయినా లాభాలు రావడం లేదు. కాంబినేషన్ నమ్ముకుని పారితోషికాలు పెంచేయడం వల్ల సినిమా బడ్జెట్ కూడా ఊహించని స్థాయికి చేరుకుంటుంది” అని అన్నారు. తనకు నటన, దర్శకత్వం మీద ఆసక్తి లేదని చెబుతూ, “పబ్లిసిటి కోసం ఎన్ని యాక్టింగ్‌లైనా చేస్తాను. అంతే తప్ప సినిమాల్లో నటించలేను. నిజం చెప్పాలంటే నిర్మాతలకు మించిన నటుడు ఎవరు వుండరు. అప్పుడప్పుడు లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటికి మాత్రం శాంతంగా వుండాల్సిన పరిస్థితి” అని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read

  • Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!
  • Ashu Reddy: అంతా ఆయన ఇష్టపూర్వకంగా ఖర్చు చేసిందే.. హైకోర్టులో అషు రెడ్డి సంచలనం!
  • Tollywood : బీస్ట్ మోడ్‌లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్
  • OTT Movies : థియేటర్స్‌లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • alluri
  • Bekkem Venu
  • Dil Raju
  • Srivishnu
  • Tata Birla madhyalo Laila

తాజావార్తలు

  • Rishabh Pant: టీమిండియాలో వికెట్ కీపర్ రేస్ హీట్.. రిషబ్ పంత్‌కు బిగ్ షాక్!

  • Salil Aarora: SRH కు మరో కాటేరమ్మ కొడుకు.. సలీల్ అరోరా ఎవరు..? చరిత్ర చూస్తే పూనకాలే..

  • Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!

  • Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

  • Tamil Nadu: విజయ్‌తో టచ్‌లోకి అన్నాడీఎంకే..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions