నివేతా థామస్.. అందం, అభినయం కలగలిపిన హీరోయిన్. టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలను ఎంచుకొని వరుస విజయాలను అందుకొంటుంది. ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ గా వచ్చినా వకీల్ సాబ్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన నివేతా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన తమ్ముడు నిఖిల్ తో ఫన్నీ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా నెట్టింట వైరల్ గా మారిన జై బాలయ్య సాంగ్ కి అమ్మడు స్పూఫ్ చేసింది.
Read also: https://ntvtelugu.com/bollywood-celebrities-tested-positive-for-corona-virus/
అఖండ చిత్రంలోని జై బాలయ్య సాంగ్ కి బాలకృష్ణ షర్ట్ లు మార్చి వేసిన స్టెప్పును నివేతా కాపీ కొట్టడానికి ప్రయత్నించింది. రెండు మూడు షర్టులను వేసుకొని వాటికి దారం కట్టి.. నివేతా స్టెప్పు వేస్తుంటే.. వెనుక నిఖిల్ దారాన్ని పట్టుకొని షర్ట్ ని లాగుతున్నాడు. కానీ చివరకి వచ్చేసరికి స్టెప్పు వేసేప్పుడు రెండో షర్ట్ సరిగా రాకపోవడంతో లాగుతూ లాగుతూ నిఖిల్ ఫ్రేమ్ లోకి వచ్చేశాడు. అది చూసుకోకుండా నివేతా స్టెప్ పూర్తి చేసి వెనక్కి తిరిగేసరికి షర్ట్ లను లాగుతూ తమ్ముడు కనిపించడంతో ఒక్కసారిగా నివేతా నవ్వడం మొదలుపెట్టింది. ఇక ఈ వీడియోను షేర్ చేసిన హీరోయిన్ ” ఏది ఏమైనా అఖండ అనుభం అదిరిపోయింది” ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన బాలయ్య అభిమానులు .. బాలయ్య స్టైలే కాదు స్టెప్పులు కూడా ఎవరికి రావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://www.instagram.com/reel/CYDtw7bpLTO/?utm_medium=copy_link