యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ నిత్యామీనన్ ప్రస్తుతం నటిగా, నిర్మాతగా, జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇటీవలే ‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కు గడుసు పెళ్ళాం గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ తాజాగా వీల్ చైర్ లో కూర్చొని కనిపించింది. అరెరే ఆమెకు ఏమైంది.. ఆమె ఎందుకు అలా కుంటుతూ నడుస్తోంది అంటూ ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు. సోమవారం ‘మోడ్రన్ లవ్ ఇన్ హైదరాబాద్’ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.. ఆ ఈవెంట్ కు నిత్యా ఒక వీల్ చైర్ లో వచ్చింది. దీంతో ఆమెను చూసి అందరూ షాక్ అయ్యారు. అయితే తాను గత రెండు రోజుల క్రితం మెట్ల మీద నుంచి కిందపడ్డానని, అందువల్లే కాలు ప్రాక్చర్ అయినట్లు నిత్యా క్లారిటీ ఇచ్చింది.
త్వరలోనే ఈ కాలు నొప్పి నుంచి ఉపశమనం పొంది మీ ముందు నడుస్తూ మాట్లాడతాను అని హామీ కూడా ఇచ్చింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఇక నిత్యా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె ధనుష్ సరసన ‘తిరుచిత్రాంబళం’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా ‘19 1 (A)’ అనే మలయాళ చిత్రంలోనూ కనిపిస్తోంది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన పోర్షన్ ను ఆమె కంప్లీట్ చేయడంతో నిర్మాతలకు ప్రాబ్లెమ్ లేదు. ప్రస్తుతం మూడు నెలలు ఆమె బెడ్ రెస్ట్ లో ఉండాలని వైద్యులు తెలిపారు.