Nithya Menon: వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరు నిత్యా మీనన్. కథకు ప్రాధాన్యం లేకపోతే అమ్మడు సినిమా కూడా ఒప్పుకోదు. ఇక తాజాగా ఆమె బేబీ బంప్ తో ప్రత్యేక్షమయ్యింది. అదేంటి నిత్యాకు ఇంకా పెళ్లి కాలేదు కదా.. గర్భవతి అంటారేంటి అని అనుకుంటున్నారా..? అవును నిత్యా పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది. ఒక సినిమా కోసం.. నిత్య ప్రస్తుతం ‘ది వండర్ వుమెన్’ అనే ఇంగ్లీష్ ప్రాజెక్ట్ చేస్తోంది. నేడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. దాన్ని ఈ భామ ఇలా చెప్పుకొచ్చింది.
బేబీ బంప్ తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ వండర్ బిగిన్స్ అని చెప్పుకొచ్చింది. ‘ది వండర్ వుమెన్’ లో తను నోరా అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాననే విషయాన్ని రివీల్ చేసింది.. “నోరా రోల్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది.. బిహైండ్ ది సీన్స్‌కి సంబంధించి మరిన్ని అడోరబుల్ పిక్స్ పోస్ట్ చేస్తుంటానని” చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమాలో నిత్యాతో పాటు పాపులర్ మలయాళీ యాక్ట్రెస్ పార్వతి, పద్మ ప్రియ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ డైరెక్టర్ అంజలి మీనన్ దర్శకత్వం వహిస్తోంది. మరి ఈ సినిమా నిత్యాకు ఎలాంటి రిజల్డ్ ను అందిస్తుందో చూడాలి.