Venkatesh- Nithin: వెంకీమామతో మహానటి-నితిన్?
- సొంత బ్యానర్ ఉన్న హీరోలలో నితిన్ కూడా ఒకరు
- నిర్మాతగా అవతారం ఎత్తబోతున్న నితిన్
- పోలీస్ అధికారి పాత్రలో వెంకటేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nithin to produce a Movie with Venkatesh as lead: చాలామంది తెలుగు హీరోలకు సొంత బ్యానర్లు ఉన్నాయి. అలా సొంత బ్యానర్ ఉన్న హీరోలలో నితిన్ కూడా ఒకరు. అయితే ఎక్కువగా నిర్మాణ బాధ్యతలు నితిన్ సోదరి అలాగే నితిన్ తండ్రి చూసుకుంటూ ఉంటారు. కానీ ఒక కథ నచ్చడంతో ఇప్పుడు మొట్టమొదటిసారిగా నితిన్ నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నారు. ఇప్పటికే హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు నితిన్. అయితే తమిళ్ డైరెక్టర్ సంతోష్ చెప్పిన కథ నచ్చడంతో ఆయన ఒక సినిమా నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. ఒక నిజ జీవిత ఘటన ఆధారంగా రాసుకున్న స్క్రిప్ట్ సంతోష్ నితిన్ కి నెరేట్ చేయగా అది ఆయనకు బాగా నచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా నటించమని విక్టరీ వెంకటేష్ ని నితిన్ అండ్ కో అప్రోచ్ అయ్యారని వెంకటేష్ కథ విని ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది.
Devara: దేవర డిస్ట్రిబ్యూటర్లకు దుబాయ్ లో పార్టీ.. నాగవంశీనా మజాకా?
Also Read
ఇక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో వెంకటేష్ ఒక పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే ఇప్పటికే కీర్తి సురేష్ ఈ సినిమా సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నితిన్ కూడా ఒక చిన్నపాటి అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. లాయర్ పాత్రలో ఆయన కనిపించబోతున్నాడని తెలుస్తోంది. తమిళ నటుడు నరేన్ ఈ సినిమాలోకి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మధ్యనే సంతోష్ అతని టీంతో కలిసి టెస్ట్ షూట్ చేశారు. అంతా ఓకే అయింది. వెంకటేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది. నితిన్ తో పాటు రాజకుమార్ ఆకెళ్ళ ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడనుంది..
తాజావార్తలు
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!