మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇప్పటికే ఆచార్య రిలీజ్ అయ్యి పరాజయాన్ని చవిచూసింది.. ఇక గాడ్ ఫాదర్ షూటింగ్ చివరి దశకు చేరుకొంది.. ఇక ప్రస్తుతం చిరు భోళా శంకర్ షూటింగ్ లో బిజీగా ఉండబోతున్నాడు.. ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు కు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. తమిళ్ హిట్ సినిమా వేదాళం చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రంపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రంలో యంగ్ హీరో నితిన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడట.. చిరు చెల్లెలు కీర్తి ప్రేమించినవాడిగా నితిన్ కనిపించనున్నాడని టాక్.. అంటే చిరుకు బావమరిదిగా యంగ్ హీరో మారనున్నాడట. అయితే నితిన్ గెస్ట్ రోల్ లో మాత్రమే నటించనున్నాడని సమాచారం. గతంలో నితిన్ – కీర్తి సురేశ్ జోడీ ‘రంగ్ దే’లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట కనిపిస్తే బావుంటుందని చెప్పడంతో నితిన్, చిరు పై ఉన్న అభిమానంతో ఓకే చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటన ఇవ్వాల్సిందే.