చెక్, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం సినిమాలతో… గత రెండేళ్లుగా యంగ్ హీరో నితిన్ ఫ్లాప్స్ ఇస్తూనే ఉన్నాడు. మధ్యలో రంగ్ దే కాస్త పర్వాలేదనిపించింది కానీ సాలిడ్ హిట్ గా నిలబడలేదు. ఈసారి మాత్రం యావరేజ్ కాదు హిట్ కొట్టాల్సిందే అంటూ ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకోని ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు నితిన్. భీష్మ సినిమాలో బాగా నవ్వించిన నితిన్… ఈసారి ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాతో కూడా నవ్వించడానికి వస్తున్నాడు. ఎన్నో హిట్ సినిమాలకి రైటర్ గా కథలు అందించి ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ, నితిన్ ని ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ చేసేసాడు.
2022 ఏప్రిల్ లోనే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ తో పాటు ప్రమోషన్స్ ని కూడా జరుపుకుంటుంది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ నవంబర్ 27న రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ అనౌన్స్మెంట్ ని ఇస్తూ కూడా నితిన్… “మన జెండా ఎజెండా… ఎంటర్టైన్మెంట్ మాత్రమే” అంటూ ట్వీట్ చేసాడు. మరి టీజర్ తో బాగానే ఫన్ జనరేట్ చేసిన నితిన్… ఈసారి ట్రైలర్ తో ఎంత రచ్చ చేస్తాడు అనేది చూడాలి. శ్రీలీల డాన్స్ అండ్ గ్లామర్, నితిన్ మార్క్ కామెడీ, వక్కంతం వంశీ రైటింగ్ లో ఉండే స్ప్రాక్… ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాలో కనిపిస్తే చాలు నితిన్ డిసెంబర్ 8న హిట్ కొట్టేసినట్లే.
Mana Jenda….Agenda…Only Entertainment 😎😎
Trailer on Nov 27th.. #ExtraOrdinaryManTrailer #ExtraOrdinaryManOnDec8th pic.twitter.com/rDJd2xBv5H
— nithiin (@actor_nithiin) November 25, 2023