Ninne Chusthu Pre Release Event Held At Prasad Labs: శ్రీకాంత్ గుర్రం, బుజ్జి హీరోహీరోయిన్లుగా కె. గోవర్ధనరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘నిన్నే చూస్తు’. హీరోయిన్ పోతిరెడ్డి హేమలత రెడ్డే ఈ సినిమాను నిర్మించడం విశేషం. రమణ్ రాథోడ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలకు ఇప్పటికే శ్రోతల నుండి విశేష ఆదరణ లభిస్తోందని నిర్మాత తెలిపారు. ఈ సినిమాను ఈ నెల 27న విడుదల చేస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా సీనియర్ నటులు సుమన్, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, నిర్మాత రామసత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.
ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్ర కథానాయిక, నిర్మాత హేమలత రెడ్డి గారి గురించి సుమన్ గారు చెప్పిన తర్వాత ఈ మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చాను. ట్రైలర్, పాటలు చూసిన తర్వాత పెద్ద సినిమాల రేంజ్ లో మంచి క్వాలిటీ తో తీసిన హేమలత రెడ్డి గారి గురించి సుమన్ గారు ఎందుకు చెప్పారనేది తెలిసింది. ఫారిన్ లొకేషన్స్ లో కూడా ఈ సినిమా పాటలను షూట్ చేశారు. చిన్న సినిమాలు ఇండస్ట్రీకి రావడం ఎంతో అవసరం. ఫిల్మ్ ఛాంబర్ ఎప్పుడూ వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది” అని అన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ, ”నేను చిన్న సినిమాల నుంచి హీరోగా ఎదిగాను. ఇక్కడే యాక్టింగ్, డ్యాన్స్ ఇలా అన్నీ నేర్చుకున్నాను. నటి, నిర్మాత హేమలత రెడ్డి చాలా యంగ్ అండ్ డైనమిక్ లేడీ. తను సుహాసిని, భానుచందర్ లాంటి పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని సినిమాలో నటిస్తూనే నిర్మాతగా చాలా చక్కగా డీల్ చేసింది. ఈ సినిమాలో తన డైలాగ్స్ అన్ని సింగల్ టేక్ లో చేసుకుంటూ అటు నిర్మాతగా ఇటు యాక్టర్ గా సర్కస్ లో రింగ్ మాస్టర్ లా తనే దగ్గరుండి చూసుకుంటూ షూటింగ్ సక్సెస్ చేసింది. సినిమా మొదలు పెట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆర్టిస్టుల విషయంలో కానీ, ప్రమోషన్ లో కాని, బడ్జెట్ లో కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి అవుట్ పుట్ వచ్చేలా సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు
చిత్ర కథానాయిక, నిర్మాత పోతిరెడ్డి హేమలత రెడ్డి మాట్లాడుతూ, ”కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనతో పెద్దలకు, ప్రేమికులకు అర్థమయ్యే రీతిలో ఈ చిత్రాన్ని చేశాం. నాకు ఇష్టమైన హీరో సుమన్, భానుచందర్, సుహాసిని, షియాజి సిండే, కిన్నెరలతో కలిసి మంచి సినిమా చేయడం ఆనందంగా ఉంది. షూటింగ్ టైంలో సీనియర్ నటులమనే తేడాలు చూపించకుండా మాకు సలహాలు, సూచనలు ఇస్తూ తల్లిదండ్రుల్లా సపోర్ట్ చేశారు. వీరితో పాటు దర్శకుడు గోవర్ధన్, మ్యూజిక్ డైరెక్టర్ రమణ్ ఇలా అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా పూర్తి చేయగలిగాం. ఈ మూవీ విషయంలో మాకు ఎంతో సాయం చేసిన ఫణి గారు నా నెక్స్ట్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కె గోవర్దన్ రావు, సంగీత దర్శకుడు రమణ రాథోడ్, ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని నిర్మాత హేమలత రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.