Nikhil: కుర్ర హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 18 పేజీస్. GA2 పిక్చర్స్ & సుకుమార్ రైటింగ్స్ పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 23 న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ వరుస సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఏడు రంగులు వాన.. రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే.. అక్షరాలా నువ్వే అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ అనంతరం పాత్రికేయలు అడిగిన ప్రశ్నలకు నిఖిల్ సమాధానాలు చెప్పుకొచ్చాడు.
ఇక ఈ నేపథ్యంలోనే సినిమాను ఎందుకు చూడాలి.. సినిమాలో సంథింగ్ డిఫరెంట్ అని డైరెక్టర్ చెప్పారు.. ఆ క్రేజీ పాయింట్ ఏంటి అని ఒక పాత్రికేయడు అడుగగా.. నిఖిల్ మాట్లాడుతూ ” సినిమాలో క్రేజీ పాయింట్ చెప్పేస్తే సినిమా ఎలా సర్.. ట్రైలర్ ఈ నెల 17 న రిలీజ్ అవుతోంది.. ట్రైలర్ ను బట్టి సినిమా అర్ధమవుతోంది. అది మా తప్పే.. ఇప్పటివరకు టీజర్ కానీ, ట్రైలర్ కానీ వదలకపోవడం.. సినిమా ఫినిష్ చేయడంలో డైరెక్టర్ బిజీగా ఉండడం వలన ఆలస్యం అయ్యింది. ట్రైలర్ తో ఈ సినిమాపై ఒక క్లారిటీ వస్తుంది” అని చెప్పుకొచ్చాడు.