Niharika : మెగా డాటర్ నిహారిక ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఆమె తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ తో పాటు ఫ్యామిలీ గురించి చాలా విషయాలు పంచుకుంది. ఇప్పుడు నేను వేరుగా ఉంటున్నా. అలా అని ఫ్యామిలీకి దూరంగా కాదు. కానీ సెపరేట్ గా ఉంటున్నా. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లి ఫ్యామిలీని కలుస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్లే నా లైఫ్. మా అన్న వరుణ్ కు కొడుకు పుట్టాడు. అప్పటి నుంచి నేను చాలా బిజీ అయిపోయాను అంటూ తెలిపింది నిహారిక.
Read Also : Kanthara -1 : డబ్బింగ్ సినిమాకు టికెట్ రేట్ల పెంపా.. ఏంటీ దారుణం
మా అల్లుడిని ఎత్తుకుని తిరుగుతున్నా. అందుకే నాకు ఎవరూ పనులు చెప్పట్లేదు. లేదంటే నాకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చెబుతూనే ఉండేవారు. నీళ్లు తీసుకురా, అది తీసుకురా అనేవారు. ఇప్పుడు ఎవరూ ఏమీ అనట్లేదు. ఒకవేళ నా అల్లుడు పెద్దయ్యాక యాక్టర్ అవుతానంటే కచ్చితంగా నా బ్యానర్ లోనే సినిమా చేస్తా. రీసెంట్ గా కల్యాణ్ బాబాయ్ ఓజీ రిలీజ్ అయింది. దెబ్బకు ఇంట్లో కూడా ఓజీ ఫీవర్ అందరికీ పట్టేసింది. ఓజీ మేం ఊహించిన దానికన్నా వేరే లెవల్ లో ఉంది అంటూ చెప్పుకొచ్చింది నిహారిక.
Read Also : Karur Stampede : గుండె వణికిపోయింది.. తొక్కిసలాటపై రజినీకాంత్, కమల్ హాసన్ రియాక్ట్