Niharika Konidela ignores divorce news in media: నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య పెద్దలు కుదిర్చిన ముహూర్తానికి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2020లో కరోనా ఉధృతి కొంచెం తగ్గిన తర్వాత అటు నాగబాబు కుటుంబం ఇటు జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుటుంబం నిశ్చయించి నిహారిక, చైతన్య ఇద్దరికీ వివాహం జరిపించారు. ఇక ఈ వివాహం రాజస్థాన్లోని ఉదయపూర్ లో రాయల్ వెడ్డింగ్ లెవెల్ లో జరిగింది. ఈ వివాహానికి కేవలం మెగా కుటుంబానికి సన్నిహితులైన వారు మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఈ ఏడాది మార్చి నెలలో ముందుగా జొన్నలగడ్డ చైతన్య, నిహారికతో కలిసి ఉన్న ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో నుంచి డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో జరిగిందనే ప్రచారం తెర మీదకు వచ్చింది.
Galla Siddharth: మహేష్ కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ?
అయితే నిహారిక ఫోటోలు డిలీట్ చేయకపోవడంతో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది, కానీ తర్వాత నిహారిక కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో నుంచి ఫోటోలు డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో జరిగిందని ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా వీరిద్దరూ మే నెలలో మ్యూచువల్ డైవర్స్ కోసం అప్లై చేశారని కోర్టు దానిని ఈరోజు మంజూరు చేసిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం మీద మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా నిహారిక మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఈ వార్తలు వైరలైన కొద్దిసేపటికి నిహారిక తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒకరికి బర్త్డే విషెస్ చెబుతూ స్టోరీ షేర్ చేశారు. నిహారిక ఎన్ఎం పేరుతో అమెరికాలో నివసిస్తూ ఈ మధ్యకాలంలో పలు తెలుగు సినిమాలకు కూడా ప్రమోషన్స్ చేసిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు ఆమె బర్త్డే విషెస్ తెలిపారు. ఇక విడాకుల వార్తల గురించి ఆమె ఏమీ స్పందించక పోవడంతో ఆమె ఈ వార్తలను లైట్ తీసుకున్నారని అంటున్నారు.

Niharika Insta Status