Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విడాకుల తరువాత.. నటిగా, నిర్మాతగా హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతుంది. ఇక నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో అభిమానులను అలరిస్తోంది. తాజాగా నిహారిక.. హాయ్ నాన్న ప్రమోషన్స్ లో భాగం అయ్యింది. నాని,మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యవ్ దర్శకత్వం వహించిన చిత్రం హాయ్ నాన్న. ఈ సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి నుంచి కూడా నాని ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడుతున్నాడు. పాన్ ఇండియా మూవీ కాబట్టి అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇంకోపక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కు, మీడియా మిత్రులకు పార్టీ కూడా ఇచ్చాడు. అందులో నిహారిక కూడా పాల్గొంది.
Sandeep Reddy Vanga: ముందు రష్మిక పాత్ర ఆ హీరోయిన్ చేసింది.. కానీ, నాకే నచ్చలేదు
ఇక తాజాగా హాయ్ నాన్న సినిమాలో నానికి కూతురుగా నటించిన చిన్నారి కియారాతో నిహారిక స్టెప్స్ వేసి అలరించింది. ఎనిమీ సినిమాలోని టం టం సాంగ్ కు డ్యాన్స్ వేశారు. అప్పట్లో ఈ సాంగ్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కియారా ఎంతో పర్ఫెక్ట్ గా స్టెప్స్ వేయడం చూసి నిహారికనే ఆశ్చర్యపోయింది. ఈ వీడియోను నిహారిక పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకు నిహారిక ప్రమోట్ చేయడం వెనుక మరో కారణం కూడా ఉంది. నిహారిక బెస్ట్ ఫ్రెండ్ అయిన నిఖిల్ అన్ననే డైరెక్టర్ శౌర్యవ్ కావడంతో.. ఆమె ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటుందనివినికిడి . మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.