Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నిహారిక..స్టార్ హీరోయిన్ గా మారుతుంది.అనుకున్నారు కానీ, ఆ సినిమా తరువాత పలు సినిమాలు చేసినా కూడా ఆమెకు ఆశించిన విజయాలు మాత్రం అందలేదు. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. అనంతరం పింక్ ఎలిఫెంట్ బ్యానర్ ను నిర్మించి యూట్యూబ్ లో షార్ట్స్ ఫిల్మ్స్ , వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ నిర్మాతగా మారింది. నటిగా కన్నా నిర్మాతగానే నిహారిక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక భర్తతో విడాకులు అయ్యిన తరువాత ఆమె మళ్లీ నటిగా మారడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఇక నిహారిక .. యాంకరింగ్ లో కూడా ఆరితేరిందని చెప్పొచ్చు. నాగబాబు జడ్జిగా చేసిన షోస్ లలో నిహారిక యాంకర్ గా చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు నిహారిక యాంకర్ గా కొత్త అవతారం ఎత్తింది. ఆహా ఓటిటీలో చెఫ్ మంత్ర అనే కుకింగ్ షో మంచి గుర్తింపునే తెచ్చుకుంది. మొదటి సీజన్ శ్రీముఖితో మొదలవ్వగా .. రెండో సీజన్ మంచు లక్ష్మీ.. ఇప్పుడు నిహారిక మూడో సీజన్ లోకి అడుగుపెట్టింది.
తాజాగా చెఫ్ మంత్ర ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నిహారిక తన మాటల చాతుర్యంతో షో మొత్తాన్ని తనవైపు తిప్పుకుంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ షోలో సెలబ్రిటీలు జంటలుగా పాల్గొంటున్నారు. బలగం బ్యూటీ కావ్య, చాందినీ చౌదరి.. నవదీప్ , తేజస్విని.. అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ ఫేమ్ సుహాస్, శరణ్య.. ఇలా వీరందరూ తమ కుకింగ్ టాలెంట్ ను బయటపెట్టడంతో పాటు ఎన్నో కబుర్లు చెప్పుకొచ్చారు. ఇక నిహారిక.. వారినుంచి రహస్యాలను చెప్పించడానికి బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మార్చి 8 న మొదటి ఎపిసోడ్ రిలీజ్ కానుంది. మరి ఈ షో.. నిహారిక కెరీర్ కు ఎలా ప్లస్ అవుతుందో చూడాలి.
Idi glimpse matrame!! E sari entertainment 3x, fun 3x. Women's Day Special
Episode promo at 5PM today. Stay tuned for non-stop entertainment. 📺🎈🎊 #WomensDaySpecial #Entertainment #ChefMantraSeason3 #ChefMantraOnaha #ChefMantra #NiharikaKonidela #niharika @KavyaKalyanram… pic.twitter.com/Ka1C5VlNMy
— ahavideoin (@ahavideoIN) March 6, 2024