మెగా డాటర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య షేక్‌పేట్‌లోని అపార్ట్మెంట్ లో జరిగిన గొడవపై క్లారిటీ ఇచ్చారు. అపార్ట్‌మెంట్ వాసులు గొడవ చేయడం వల్లే పీఎస్‌లో ఫిర్యాదు చేశానని చైతన్య తెలిపాడు. అందరం మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకున్నట్లు తెలిపారు. అయితే ముందు తనమీదే కేసు నమోదైనట్లు వార్తలు రావడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ముందుగానే నేనే ఫిర్యాదు చేశాను. 25 మంది వచ్చి మా డోర్ బాదడంతో ఫిర్యాదు చేశాను. నేను అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్న పర్పస్ మా ఓనర్ కు తెలియజేశాను. ఆ విషయం అపార్ట్మెంట్ వాసులకు క్లారిటీ లేకపోవడం తోటే గొడవ జరిగింది. ఆ అపార్ట్మెంట్లో 25 నుంచి 30 కుటుంబాలు ఉంటున్నాయి. కమర్షియల్ ఆఫీస్ కావడంతో.. మిగితా ఫ్లాట్ వాళ్లకి ఇబ్బందికరంగా ఉందంటూ వచ్చి గొడవ లాగా చేశారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాం. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆగస్టు 10లోగా ఫ్లాట్ ఖాళీ చేస్తున్నట్లు ముందే ఓనర్‌కి చెప్పినట్లు చైతన్య తెలిపారు.