ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో స్టేటస్ అనుభవిస్తున్న వారిలో.. ఎక్కువ మంది స్టార్ హీరోల వారసులే ఉన్నారు. మెగా, నందమూరి, అక్కినేని, ఘట్టమనేని వారుసులుగా.. తరానికో స్టార్ హీరో వస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో తరం వారసులు రెడీ అవుతున్నారు. వారిలో ముఖ్యంగా ఇప్పుడు అందరి దృష్టి.. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వారసులపైనే ఉంది. ఇప్పటికే వారి ఎంట్రీ గురించి రకరకాల కథనాలు వస్తునే ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ల గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవలె బాలయ్య ఫ్యామిలీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే నందమూరి ఫ్యాన్స్ అంతా మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ లేటెస్ట్ ఫోటోలో మోక్షజ్ఞ కాస్త బొద్దుగా కనిపించాడు. దాంతో మోక్షజ్ఙ ఎంట్రీకి ఇంకాస్త సమయం పట్టేలా ఉందంటున్నారు.
ఇక మెగా అభిమానులు పవర్ స్టార్ వారసుడు అకీరా నందన్ ఎంట్రీ గురించి చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. రీసెంట్‌గా ఎవరూ ఊహించని విధంగా.. పవన్-రేణూ ఒకే ఫ్రేమ్ లో కలిసి కనిపించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. అకీరా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా.. తల్లిదండ్రులుగా పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్.. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ‘ఆర్ఆర్ఆర్’లోని దోస్తీ పాట ట్యూన్‌ను పియానో ప్లే చేసి ఆకట్టుకున్నాడు అకీరా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ఇకపోతే.. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీతో యూరోప్ ట్రిప్‌లో ఉండగానే.. మహేష్ కొడుకు గౌతమ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చాయి.. గౌతమ్ అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించాడు. ఈ సందర్భంగా మహేష్, నమ్రత తమ అనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘జర్మనీలో గౌతమ్ ఘట్టమనేని హై స్కూల్ గ్రాడ్యుయేషన్ సెలబ్రేట్ చేస్తున్నాం.. గౌతమ్‌ను చూస్తే గర్వంగా ఉంది’.. అని ఓ సెల్పీని కూడా షేర్ చేసుకున్నారు మహేష్. ఇలా గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలో ఈ స్టార్ వారసుల సందడి కనిపిస్తోంది. దాంతో వీళ్ల ఎంట్రీ గురించి చర్చించుకుంటున్నారు అభిమానులు. మరి ఈ ముగ్గురు స్టార్ హీరోల వారసులు ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తారో చూడాలి.