ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడి ఉంటాయి కానీ ఈసారి జరగబోయే వార్ మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్లాష్‌గా నిలవబోతోంది. సౌత్ వర్సెస్ నార్త్ వార్ జరగబోతోంది. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లు కొట్టిన హీరో, మూడు ఫ్లాప్‌లు ఉన్న పాన్ ఇండియా హీరో మధ్య వార్ జరగబోతోంది. ఎవరి ట్రాక్ రికార్డులు వాళ్లకున్నప్పటికీ… ప్రభాస్ సినిమాతో పోటీ అంటే, క్షణం కూడా ఆలోచించకుండా పోస్ట్‌పోన్ చేసుకుంటారు మిగతా హీరోలు. అందుకే డిసెంబర్ 22న సలార్ వస్తుందని అనౌన్స్ చేయగానే… నాలుగైదు సినిమాలు వేరే డేట్స్ వెతుకున్నాయి. ప్రభాస్‌తో పోటీ అంటే చాలా రిస్క్ అని అన్ని ఇండస్ట్రీలకు తెలుసు కానీ ఆ రిస్క్ ని ఫేస్ చేయడానికి రెడీ అయ్యాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. వరుసగా రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చిన షారుఖ్, కెరీర్ పీక్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి… ప్రభాస్‌తో క్లాష్‌కు రెడీ అవుతున్నాడు.
ఇక్కడ షారుఖ్, ప్రభాస్‌తో పోటీకి రావడం లేదు… ప్రభాస్‌యే షారుఖ్‌ని ఢీ కొట్టబోతున్నాడు. డిసెంబర్ 22న డంకీ వస్తుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయినా కూడా కావాలనే సలార్‌ను ఆ రోజు రిలీజ్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. దీంతో సలార్ దెబ్బకు డంకీ పోస్ట్ పోన్ అవుతుందనే టాక్ నడుస్తోంది కానీ ఇప్పుడు ఓ రోజు ముందుగానే థియేటర్లోకి రావడానికి ప్లాన్ చేస్తున్నాడు షారుఖ్. సలార్‌కు భయపడే ఛాన్సే లేదు అంటూ… డిసెంబర్ 22న కాకుండా 21న డంకీ రిలీజ్‌కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఓ రోజు ముందుగానే థియేటర్లోకి వస్తే… ఓపెనింగ్స్‌లో డంకీకి తిరుగుండదనేది మేకర్స్ ప్లాన్. నెక్స్ట్ డే రానున్న సలార్ ఖచ్చితంగా కలెక్షన్స్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్ట్రాటజీతోనే డంకీ ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ బిగ్గెస్ట్ క్లాష్‌లో ఎవరు నెగ్గుతారో చూడాలి.