Santhosh Sobhan: భలే ఉందిగా… కొత్త టైటిల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంతోష్ శోభన్ హీరోగా నటించిన ‘ఏక్ మినీ కథ’ మూవీకి ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ, కథనం అందించాడు. ఆ మూవీకి వీక్షకుల నుండి సూపర్ రెస్సాన్స్ రావడంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా మొదలైంది. ఈ మూవీకి మేర్లపాక గాంధీనే దర్శకత్వం వహిస్తున్నాడు. ‘శ్యామ్ సింగరాయ్’ మూవీని అందించిన వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Also Read
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్నఈ లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌లో సంతోష్ శోభన్ జోడిగా ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు, ఈ సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ అనే క్రేజీ టైటిల్ పెట్టారు. ఇవి యూ-ట్యూబ్ లో వీడియో కంటెంట్‌ను ప్రచారం చేయడానికి ఉపయోగించే సాధారణ పదాలు. ప్రతి పదాన్ని సూచించే చిహ్నాలతో టైటిల్ లోగో చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్ అడవిలో, టాప్ యాంగిల్‌లో విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ చూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తుంటే సినిమా కథ చాలా విలక్షణంగా ఉండబోతోందని అర్ధమౌతోంది. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.
తాజావార్తలు
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!