టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఇటీవలే తండ్రి అయిన విషయం విదితమే. కరోనా లాక్ డౌన్ సమయంలో వైఘా రెడ్డి ని రెండు వివాహం చేసుకున్న దిల్ రాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మొదటి భార్య అనిత అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతిచెందడంతో దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి తండ్రికి దగ్గర ఉండి రెండో వివాహం జరిపించింది. ఇక ఇటీవలే వైఘా రెడ్డి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక బిడ్డకు దిల్ రాజు అద్భుతమైన పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అదేంటంటే దిల్ రాజు తన వారసుడుకు అన్వి రెడ్డి అనే పేరును పెట్టినట్లు సమాచారం.
తన మొదటి భార్య అనిత పేరు కలిసివచ్చేలా కొడుకుకు ఆ పేరు పెట్టినట్లు వినికిడి. అంటే ఇప్పటికీ దిల్ రాజు మొదటి భార్యను మర్చిపోకుండా ఉన్నాడని అర్ధమవుతుంది. వైఘా రెడ్డి కూడా పేరు విషయంలో భర్త మాట జవదాటలేదట. అంతేకాకుండా ఈ పేరుకు సంస్కృతంలో మంచి అర్ధం కూడా ఉండడంతో దిల్ రాజు ఎంతో ఆనందంగా ఉన్నాడని తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం దిల్ రాజు టాలీవుడ్ లో పలు స్టార్ హీరోల సినిమాలు నిర్మిస్తున్నాడు. కోలీవుడ్ లో వారసుడు చిత్రంతో అడుగుపెడుతున్నాడు. మరి బిడ్డ వచ్చిన వేళ దిల్ రాజుకు అన్ని శుభాలే జరగడం విశేషం.