టాలీవుడ్‌లోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు. వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. కొందరు మాత్రం అసలు కనిపించకుండానే ఫేడవుట్ అయిపోతారు. అయితే కొందరు ముద్దుగుమ్మలు మాత్రం సక్సెస్ రాకపోయినా ఒక్క చూపుతోనే ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చేసేస్తారు. అలాంటి బ్యూటీనే సాక్షి వైద్య అని చెప్పొచ్చు. ఈ క్యూటీ బ్యూటీ అందానికి ఫిదా అవాల్సిందే. ఒక హీరోయిన్‌కు ఏమేం కావాలో అన్ని సాక్షిలో ఉన్నాయి. చూడగానే కట్టిపడేసేలా ఉంటుంది అమ్మడి గ్లామర్. అందుకే ఫస్ట్ సినిమాతోనే అఖిల్ సరసన ఛాన్స్ అందుకుంది. పైగా సురేందర్ రెడ్డి డైరెక్టర్ కావడంతో.. ఇక హీరోయిన్‌గా జెండా పాతేసినట్టేనని మురిసిపోయింది సాక్షి. అందుకే.. ఏజెంట్ సినిమా గురించి సాక్షి వైద్య ఎన్నో కలలు కన్నది కానీ అఖిల్‌తో పాటు సాక్షి కూడా దారుణమైన డిజాస్టర్ చూడాల్సి వచ్చింది.
ఏజెంట్ దెబ్బకు సాక్షి ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఈ సినిమాతో మరిన్ని ఆఫర్లు వస్తాయనుకున్న సాక్షి.. తెలుగు ఆడియెన్స్ మైండ్‌లో పెద్దగా రిజష్టర్ అవలేదు. కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘గాండీవధారి అర్జున’తో మెగా హీరో తనకు హిట్ ఇస్తాడని భారీ ఆశలు పెట్టుకుంది. ఏజెంట్ సెట్స్ పై ఉండగానే.. వరుణ్ తేజ్‌తో ఛాన్స్ అందుకుంది సాక్షి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ వారమే థియేటర్లోకి వచ్చింది. కానీ ఈ సినిమా కూడా ఏజెంట్ రేంజ్ నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే.. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. సాక్షి నటించిన ఈ రెండు సినిమాలు కూడా స్పై థ్రిల్లర్‌గానే వచ్చాయి. అందుకేనేమో.. సాక్షికి ఈ రెండు సినిమాలు కలిసి రాలేదేమో. అయినా కూడా ఈ క్యూట్ బ్యూటీ ఏకంగా పవర్ స్టార్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌లో’ సెకండ్ హీరోయిన్‌గా ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే.. ఈ సినిమాపైనే సాక్షి భారీ ఆశలు పెట్టుకుంది. మరి పవన్ అయిన అమ్మడికి హిట్ ఇస్తాడేమో చూడాలి.