సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే కోంత మంది మహిళా దర్శకులు కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంన్నారు. కానీ హీరోయిన్‌గా విజయాన్ని అందుకున్న తర్వాత కెరీర్‌లో కొంత గ్యాప్ తీసుకుని, మళ్లీ కెమెరా వెనుక దర్శకురాలిగా మారడం చాలా అరుదు. అలాంటి అరుదైన మార్గంలో అడుగుపెట్టబోతోంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తొలి సినిమా చిరుత హీరోయిన్ నేహా శర్మ. చిరుత సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ, ఆ తర్వాత కుర్రోడు చిత్రంలో వరుణ్ సందేశ్‌తో జత కట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి, మంచి క్రేజ్‌ను సంపాదించింది. తమిళం, మలయాళం, పంజాబీ భాషల్లో కూడా సినిమాలు చేసి తన నటనా ప్రతిభను చూపించింది.
Also Read : Baahubali : బాహుబలి ఎపిక్ కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఒకే వేదికపై ప్రభాస్,అనుష్క..
ఇక తాజాగా నేహా శర్మ దర్శకురాలిగా మారబోతుందనే వార్తలు బాలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నిర్మాణంలో తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది, మోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్. 1945 నాటి నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకోనుందట. అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుందట. ఇదే కనుక నిజం అయితే నేహా శర్మ కెరీర్‌లో ఇది ఒక పెద్ద మలుపుగా నిలిచే అవకాశం ఉంది.